బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ తాజాగా ఛావా అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీలో రష్మిక మందన హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ని కొన్ని రోజుల క్రితమే హిందీ భాషలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. ఈ మూవీ కి విడుదల ఆయన మొదటి రోజు మొదటి షో కే ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ కి మొదటి రోజు భారీ ఓపెనింగ్లు లభించాయి. అలాగే ఈ మూవీ కి ఆ తర్వాత కూడా సూపర్ సాలిడ్ కలెక్షన్లు దక్కుతూ వచ్చాయి. ఇప్పటికే ఈ సినిమా అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేసి భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఇలా హిందీ భాషలో విడుదల అయ్యి సూపర్ సక్సెస్ అయిన ఈ సినిమాను ఈ రోజు అనగా మార్చి 7 వ తేదీన తెలుగు భాషలో కూడా విడుదల చేశారు. ఇకపోతే తెలుగు భాషలో ఈ మూవీ ని గీత ఆర్ట్స్ బ్యానర్ వారు విడుదల చేశారు. ఇక ఈ మూవీ తెలుగు వర్షన్ కి జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలను తెలుసుకుందాం.

మూవీ తెలుగు వర్షన్ కి దాదాపు 2.75 కోట్ల రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది. దానితో ఈ మూవీ 3 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్లు వసూలు చేసినట్లయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ను అందుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే భారీ కలెక్షన్లను వసూలు చేసి అద్భుతమైన విజయాన్ని అందుకున్న సినిమా కావడంతో ఆ రేంజ్ విజయం సాధించిన సినిమాకు ఇది చాలా తక్కువ టార్గెట్ అని కొంత మంది అభిప్రాయపడుతూ ఉంటే , మరి కొంత మంది మాత్రం ఇప్పటికే ఈ సినిమాను చాలా శాతం మంది హిందీలోనే చూసేసారు. కాబట్టి ఈ సినిమా తెలుగు వర్షన్ కి అంత డిమాండ్ ఉండే అవకాశాలు లేవు అని అభిప్రాయాలను కొంత మంది వ్యక్తం చేస్తున్నారు. మరి ఛావా తెలుగు వర్షన్ కి ఏ రేంజ్ కలెక్షన్లు వస్తాయో ... ఈ మూవీ తెలుగు వర్షన్ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: