
ఇది పాన్ ఇండియా సబ్జెక్ట్ ఏ .. ఖర్చు కూడా బాగానే పెడుతున్నారు .. కానీ ఇక్కడ సినిమాకు పెట్టే ఖర్చు కాదు .. విశ్వంభర సబ్జెక్ట్ నార్త్ ప్రేక్షకులకు ఎక్కాలి . అది జరిగితే చిరంజీవి పాన్ ఇండియా కళ నెరవేరినట్టే .. రీ ఎంట్రీలో కూడా బాలీవుడ్ లో మెరిసిన ఘనత చిరు సొంతం అవుతుంది. బాలకృష్ణ కూడా ఇప్పటికే పాన్ ఇండియా సినిమా దిశగతన ప్రయత్నాలు వేగవంతం చేశారు .. భగవంత్ కేసరి సినిమాకు స్వయంగా తానే డబ్బింగ్ చెప్పి మరి హిందీలో రిలీజ్ చేశారు .. అయితే ఇది ఒకేసారి రిలీజ్ కాదు .. ఇక ఇప్పుడు తాజాగా డాకు మహారాజ్ హిందీ వెర్షన్ కూడా రిలీజ్ అయింది .. అయితే ఈ రెండు అక్కడ క్లిక్ ఇవ్వలేదు .. బాలకృష్ణకు పాన్ ఇండియ ఇమేజ్ రాలేదు . ఇక ఇప్పుడు బాలకృష్ణ తన ఆశలన్నీ అఖండ 2 పైనే పెట్టుకున్నారు .. ఇక దీనికి రెండు కారణాలు ఒకటి బోయపాటి ఊర మాస్ టేకింగ్ కాగా .. రెండోది నార్త్ జనాల్ని బాగా ఎట్రాక్ట్ చేస్తే మైథలాజికల్ సబ్జెక్ట్ . ఇంతకుముందు బోయపాటి తీసిన కొన్ని సినిమాలు హిందీ వెర్షన్ యూట్యూబ్లో సూపర్ హిట్గా నిలిచిన విషయం తెలిసిందే .. ఇప్పుడు ఇలా ఈసారి ఎలాగైనా పాన్ ఇండియా స్థాయిలో భారీ రికార్డులు కొట్టాలని డిసైడ్ అయ్యారు .
ఇక నాగార్జున , వెంకటేష్ అయితే ఈ రేసుకు చాలా దూరంగా ఉన్నారు .. వెంకటేష్ తన సినిమాలన్నీ పూర్తిగా తెలుగు మార్కెటుకే పరిమితం చేసుకున్నారు .. ఇప్పుడు బ్లాక్ బస్టర్ హీట్ అయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాను హిందీలో విడుదల చేయలేదు .. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా చేయాలని అనుకుని చేస్తేపాన్ ఇండియా సినిమా అవ్వదని .. చేసిన సినిమా పాన్ ఇండియ స్థాయిలో హిట్ అయినప్పుడు మాత్రమే అది పాన్ ఇండియా మూవీ అనిపించుకుంటుందని గతంలో వెంకటేష్ అన్నారు .. ఆయన అన్న మాటలు బాగున్నాయి కానీ కనీసం ఆ దిశగా ఆయన ప్రయత్నం చేయడం లేదు . నాగార్జున విషయం సరే .. ఈయన రీజనల్ సినిమానే చేయడం లేదు .. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈయన నుంచి పాన్ ఇండియా సినిమా ఆశించడం కష్టమే .. కాకపోతే ఈ లోటును కాస్త భర్తీ చేస్తూ భారీ సినిమాల్లో కీలక పాత్రలో నటిస్తున్నాడు నాగార్జున.