
ఏకంగా 85 కోట్లకు ఈ సినిమాను నెట్ఫ్లిక్స్ కొనుక్కుంది .. రిలీజ్ తర్వాత ఈ సినిమా 350 కోట్ల కలెక్షన్లు అంతకుమించి థియేటర్లు వసూలు రాబడితే .. ఈ సినిమాకు మరో 15 కోట్ల రూపాయలు ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది .. ఇలా కనీసం 85 కోట్లు అనుకుంటే దానికి అదనంగా మ్యూజిక్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడైపోయాయట . ఇక ఈ సినిమా మ్యూజిక్ రైట్స్ ను జిమ్ మ్యూజిక్ కంపెనీ 30 కోట్లకు వెచ్చించి కొనుగోలు చేయడమే కాకుండా టీవీ రైట్స్ ని కూడా జి నెట్వర్క్ సొంతం చేసుకుందట .. ఇలా మ్యూజిక్ టీవీ రేట్స్ రూపంలో ఈ ఏకంగా 80 కోట్ల రూపాయలు ఈ సినిమా యూనిట్ కు వచ్చి పడ్డాయి .. ఇలా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ద్వారానే 165 కోట్ల రూపాయలు సికిందర్ సినిమాకు వచ్చింది .
ఇక ఈ సినిమా బడ్జెట్ కూడా అతి భారీ స్థాయిలో లేకపోవడం మరో అడ్వాంటేజ్ .. 400 నూంచి 500 కోట్ల బడ్జెట్ అంటే ఇలా వచ్చే 165 కోట్లు కూడా ఒక మూలకు రావు .. ఇక ఈ సినిమాకు సల్మాన్ ఖాన్ పారితోషికాన్ని పక్కన పెడితే మొత్తంగా బడ్జెట్ 200 కోట్ల రూపాయలు మధ్యలోనే ఉందని అంచనా .. మరి ఈ 200 కోట్ల బడ్జెట్ను ఇలా అటు ఇటుగా 80% ఇలా డిజిటల్ స్ట్రీమింగ్ ద్వారానే సినిమా రాబట్టుకుంది .. రిలీజ్ తర్వాత ఎలాగూ థియేటర్ రైట్స్ విషయంలో ఓపెనింగ్స్ కు ఎలాంటి కొదవలేదు . బాలీవుడ్ లో దక్షిణాది దర్శకుల సినిమాలకు భారీ ఓపెనింగ్ వస్తున్నాయి .. దీంతో ఈ సినిమాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు .. అలాగే సల్మాన్ ఖాన్ కు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే ఆయనకు కొంత సేఫ్ఫెస్ట్ వెంచర్ కూడా అవుతుంది . ఇక మరి ఈ సినిమాతో సల్మాన్ ఖాన్ ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తారా చూడాలి.