స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ పుష్ప చిత్రంతో పాన్ ఇండియా లెవెల్లో పెరిగిపోయింది. ఎక్కడ చూసినా కూడా పుష్ప సినిమా మానియానే కనిపించింది. నేషనల్ అవార్డు రావడంతో మరింత క్రేజ్ సంపాదించుకున్నారు..అయితే పుష్ప 2 రిలీజ్ తర్వాత మరింత పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ అన్ని వివాదాలు అల్లు అర్జున్ ది చుట్టుముట్టాయి. ప్రస్తుతం తన తదుపరి చిత్రాలతో బిజీగా ఉన్న అల్లు అర్జున్ పలువురు దర్శకులు కూడా అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.


పుష్ప సినిమా కోసం ఏకంగా ఐదేళ్లపాటు తన డేట్ లను కేటాయించారు అల్లు అర్జున్.. ఇకపై ఏడాదికి రెండు మూడు చిత్రాలు తీసే విధంగా ప్లాన్ చేశారు. ఆ మధ్య అభిమానులకు ఈ విషయం పైన బన్నీ ప్రామిస్ చేసినట్లుగా తెలుస్తోంది. మొన్నటి వరకు త్రివిక్రమ్ తదుపరిచిత్రం పై రేసులో ఉన్నప్పటికీ ఆ తర్వాత అట్లి వచ్చారు. మరి ఎవరితో సినిమా చేస్తారనే విషయం ఇంకా క్లారిటీగా రాలేదు ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే భారీ బడ్జెట్ తో ఉంటుందని వార్తలు అయితే వినిపిస్తున్నాయి.


ఇదంతా ఇలా ఉంటే అల్లు అర్జున్ రేంజ్ రోజు రోజీకి పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా అల్లు అర్జున్ కు ఆర్మీ కూడా ఉన్న సంగతి తెలిసిందే కొంతమంది అభిమానులు అల్లు అర్జున్ ఎక్కడికి వెళ్లినా సరే అక్కడ కొన్ని పిచ్చి పనులు చేస్తూ ఉంటారు.. ఇప్పుడు తాజాగా 100 రూపాయల నోటు పైన అల్లు అర్జున్ ముఖచిత్రం ఉన్న ఫోటోలను వైరల్ గా చేస్తున్నారు. వంద రూపాయల నోటు పైన గాంధీ తాతను బదులుగా పుష్పరాజ్ ని పెట్టి మరి తమ అభిమానాన్ని చాటుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అయితే దీనిని కొంతమంది తప్పు పడుతూ ఉండగా మరికొంతమంది అల్లు అర్జున్ అంటే అభిమానులకు ఇంత పిచ్చా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: