
ఇక రమ్య మాట్లాడుతూ .. నాతో కలిసి నటించడం కొంతమంది హీరోలు ఇప్పుడు సూపర్ స్టార్ అయ్యారు .. నేను మొదట్లో నాకంటే తక్కువ పారితోషికం తీసుకొని నటులతో కలిసి పనిచేసినప్పుడు .. ఆ సినిమా హిట్ అయిన వెంటనే వారు తదుపరి సినిమాకి నాకంటే ఐదు రెట్లు ఎక్కువ రెమ్యూనికేషన్ అందుకునేవారు .. హీరోగా వారికి 5 కోట్ల జీతం ఉంటే నాకు కోటి వచ్చేది .. మనం కూడా వారిలాగే అదే వర్క్ చేస్తున్నప్పుడు మనకు తక్కువ జీతం ఎందుకు వస్తుంది , వారికి ఎక్కువ జీతం ఎందుకు ..? చిత్ర పరిశ్రమ లో చెప్పడానికి ఇలాంటివి ఎన్నో కథలు ఉన్నాయి .. కానీ ఎవరు వాటిని చెప్పడానికి ముందుకు రారు .. అంటూ తన అసంతృప్తి వ్యక్తం చేసింది ..
ఇప్పటికీ లేడీ ఓరియంటెడ్ సినిమాలను తీస్తున్నారు .. కానీ అది మహిళా ప్రధాన చిత్రాల కనిపించవు .. మన భారతీయ చిత్ర పరిశ్రమలో విద్యాబాలన్ ఎంతో ప్రతిభావంతమైన గొప్ప నటి , కానీ ఆమె దక్షిణ భారతదేశం లో పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు .. నటీమణులు ఒక సినిమా తర్వాత మరొక సినిమా హిట్ అందుకోలేరు .. అందుకే వారికి నెగిటివ్ ట్యాగ్ వస్తుంది .. మనం ఒక సక్సెస్ అందుకుంటే పది ప్రాజెక్టులు మన దగ్గరికి వస్తాయంటూ ఆమె సంచల కామెంట్లు చేసింది.