మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం మాస్ జాతర అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఈ మూవీ ని ఈ సంవత్సరం మే 9 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే రవితేజ , కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరో గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కిషోర్ తిరుమల ఓ అదిరిపోయే కథను రవితేజకు వినిపించగా , అది బాగా నచ్చడంతో వెంటనే రవితేజ , కిషోర్ తిరుమల దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం కిషోర్ తిరుమల , రవితేజ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. రవితేజ "మాస్ జాతర" సినిమా షూటింగ్ను కంప్లీట్ చేసుకునే లోపు కిషోర్ తిరుమల , రవితోజ తో చేయబోయే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను మొత్తం పూర్తి చేసే ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే కిషోర్ తిరుమల , రవితేజ తో చాలా స్పీడ్ గా మూవీ ని పూర్తి చేసి , ఆ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగకు విడుదల చేయాలి అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే కిషోర్ తిరుమల ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను పక్కాగా పూర్తి చేసుకుని ఈ మూవీ షూటింగ్ మొదలు పెట్టాక కేవలం 65 నుండి 75 రోజుల లోపే ఈ మూవీ మొత్తం షూటింగ్లో పూర్తి చేసి ఈ మూవీ ని కచ్చితంగా వచ్చే సంవత్సరం సంక్రాంతి పండక్కి విడుదల చేయాలి అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా పక్కా ప్లానింగ్ తో రవితేజతో సినిమా పూర్తి చేయాలి అనే ఆలోచనలో కిషోర్ తిరుమల ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: