నిన్నటి రోజు నుంచి కన్నడ నటి రన్యా రావు బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడడంతో ఒక్కసారిగా కన్నడ సినీ ఇండస్ట్రీ ఉలిక్కిపాటికి గురైంది. బెంగళూరు ఎయిర్ పోర్ట్ లో రన్యా రావు అరెస్ట్ కూడా చేయడం జరిగింది. సోమవారం రాత్రి దుబాయ్ నుంచి వస్తున్న ఆమె 12 కోట్లు విలువైన 14.8 కిలోల బంగారాన్ని తీసుకువస్తూ పట్టుబడింది. ఈ క్రేసులో ప్రస్తుతం ఇమే బెయిల్ కోసం పిటిషన్ కూడా దాఖలు చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. గోల్డ్ స్మగ్లింగ్ తో ఈమె భర్త జితిన్ హుక్కర్ కి కూడా ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే విషయంపై పోలీసులు విచారణ చేపడుతున్నారట.


ఈ క్రమంలోనే అసలు రన్యా భర్త ఎవరు? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనే విషయాలను కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా రన్యా, జితిన్ గడచిన నాలుగు నెలల క్రితమే తాజ్ వెస్టులో గ్రాండ్గా వివాహాన్ని చేసుకున్నారట. ఆ తర్వాతే బెంగళూరులో ప్రస్తుతం ఒక లగ్జరీ అపార్ట్మెంట్లో వీరు కాపురం ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇక జతిన్ వృత్తిరీత్యా ఒక ఆర్కిటెక్ట్.. బెంగళూరులో చదివిన జతిన్ పై చదువులను ఇతర దేశాలలో కూడా చదివారట. జతిన్ ఇండియాలో పాటుగా లండన్ లో కూడా పలు నిర్మాణాలకు డిజైన్లు కూడా చేసినట్లు సమాచారం.


జతిన్ కు WDA &DECODE LLC అనే కంపెనీలు కూడా ఉన్నాయట. ఇవే కాకుండా బెంగళూరులో బార్ అండ్ డిజైనర్ లను కూడా ఈయన డిజైన్ చేస్తూ ఉంటారట. ఇవే కాకుండా ఢిల్లీ ,ముంబై వంటి ప్రాంతాలలో కూడా పలు రకాల ప్రాజెక్టులను కూడా చేస్తూ ఉంటారు. ఉన్నత విద్యను అభ్యసించి వృత్తిరీత్యా కూడా టాప్ పొజిషన్లోనే ఉన్న జతిన్ కి గోల్డ్ స్మగ్లింగ్ కి లింకు ఉందా లేదా అన్న విషయం ఇంకా అధికారులు విచారణ చేపడుతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: