
కర్ణాటక రాష్ట్ర సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం విషయంలో ప్రశంసలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. సినిమా రంగాన్ని ప్రోత్సహించడం కోసం కర్ణాటక సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పుకొచ్చారు. మల్టీప్లెక్స్ లతో పాటు రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో అన్ని షోలకు ఇదే రేటు ఉంటుందని కర్ణాటక సీఎం పేర్కొన్నారు. సామాన్యులకు సైతం సినిమా అందుబాటులోకి రావాలని ఈ నిర్ణయం తీసుకున్నామని కర్ణాటక సీఎం వెల్లడించారు.
కన్నడ సినిమాలను ప్రమోట్ చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఆధ్యర్యంలో నడిచే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ను సైతం అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తున్నారని ఆయన తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో మైసూర్ లో ఫిల్మ్ సిటీని నిర్మించడానికి 150 ఎకరాల భూమిని ఇస్తున్నట్టు సీఎం ప్రకటన చేశారు. ఈ ఫిల్మ్ సిటీ నిర్మాణం కోసం 500 కోట్ల రూపాయల బడ్జెట్ ను కేటాయిస్తున్నట్టు తెలిపారు.
కన్నడ సినిమాలకు సంబంధించి సీఎం తీసుకున్న నిర్ణయాలు ఏ మేరకు పాజిటివ్ ఫలితాలను అందిస్తాయో చూడాల్సి ఉంది. సీఎం సిద్ధరామయ్య తీసుకున్న నిర్ణయాలపై ఇండస్ట్రీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది. కన్నడ సినిమాలలో మెజారిటీ సినిమాలు రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు క్రియేట్ చేయాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు. కర్ణాటక సర్కార్ నిర్ణయం వల్ల మల్టీప్లెక్స్ లు తీవ్రస్థాయిలో నష్టపోయే అవకాశం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.