
అయితే తెలుస్తున్న సమాచారంమేరకు ఈ సీక్వెల్ స్క్రిప్ట్ విషయంలో ఇప్పటికే దర్శకుడు కొరటాల శివ తన టీమ్ తో వర్క్ మొదలుపెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం జూనియర్ నటిస్తున్న బాలీవుడ్ మూవీ ‘వార్ 2’ షూటింగ్ విషయంలో చివరిదశలో ఉంది. ఈ మూవీ ఆగష్టు 15న విడుదల కాబోతోంది. బాలీవుడ్ టాప్ హీరో హృతిక్ రోషన్ తో తారక్ నటిస్తున్న ఈ మూవీ పై అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి.
లేటెస్ట్ గా మొదలైన ప్రశాంత్ నీల్ జూనియర్ ల మూవీ ‘డ్రాగన్’ మూవీ షూటింగ్ లోకి జూనియర్ ఏప్రియల్ నుండి అడుగుపెట్టి ఎక్కడా బ్రేక్ లేకుండా కొనసాగించి అక్టోబర్ ప్రాంతంలో ఈమూవీ షూటింగ్ ను పూర్తి చేసే ప్లాన్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 2026 సంక్రాంతిని టార్గెట్ చేస్తూ విడుదల కాబోతున్న ఈమూవీ తరువాత అన్నీ అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే ‘దేవర 2’ ను మొదలుపెట్టాలని జూనియర్ ప్లాన్ అని అంటున్నారు.
అయితే ఈ సీక్వెల్ స్క్రిప్ట్ పూర్తిగా తయారుకావడమే కాకుండా ఆ స్క్రిప్ట్ జూనియర్ కు పూర్తిగా నచ్చినప్పుడు మాత్రమే ఈమూవీ షూటింగ్ మొదలవుతుందని అంటున్నారు. కళ్యాణ్ రామ్ సొంత నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రొడక్షన్ హౌస్ పై నిర్మాణం జరుపుకుంటున్న మూవీ కాబట్టి ఈ సీక్వెల్ స్క్రిప్ట్ ఏమాత్రం బాగా వచ్చినా వచ్చే సంశవత్సరం నిర్మాణం ప్రారంభించి 2027 సంక్రాంతికి విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తారని అంటున్నారు. ఈమూవీలో విలన్ సైఫ్ అలీ ఖాన్ తో పాటు బాబీ డియోల్ కూడా చేరతాడనే ప్రచారం జరుగుతోంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా కొనసాగుతుందని టాక్..