
ఎంతో అన్యోన్యంగా కొనసాగిన చైతన్య, నిహారిక వైవాహిక జీవితం అతి తక్కువ సమయంలోనే ముగింపు పలికింది. కొన్ని అనివార్య కారణాలతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. విడాకుల అనంతరం నిహారిక చాలా సంతోషంగా తన జీవితాన్ని గడుపుతున్నారు. విడాకుల తర్వాత నిహారిక సోషల్ మీడియాలో చాల యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా తన ఫ్రెండ్స్ తో వెకేషన్ కి వెళ్లడం, పార్టీలకు, పబ్బులకి వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
విడాకుల అనంతరం నిహారిక ఎన్నో ట్రోల్స్ ను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఎంతో నెగిటివిటీని ఎదుర్కొన్న నిహారిక వాటిని ఏమి పట్టించుకోలేదు. అయితే తన విడాకుల గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిహారిక మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు. అందులో భాగంగా సెలబ్రిటీ అయినప్పటికీ విడాకులు అనేవి ఏ స్త్రీకి అయినా చాలా బాధాకరమని నిహారిక అన్నారు.
వివాహం చేసుకునే ముందు విడాకుల గురించి ఎవరు ఆలోచించరని నిహారిక అన్నారు. కానీ కొన్నిసార్లు అనుకొని పరిణామాల వల్ల కొన్ని అదుపుతప్పుతాయి. అనుకోని కారణాలవల్ల కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని నిహారిక అన్నారు. నిహారిక మాట్లాడిన మాటలను బట్టి తాను తన భర్త నుంచి విడాకులు తీసుకొని తప్పు చేసినట్లు ఫీల్ అవుతుందని కొంతమంది అంటున్నారు. ప్రస్తుతం ఈ మాటలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.