
తెలుగులో విడుదలైన ఛావా సినిమా ఇందులో ఉండే విజువల్స్, యాక్షన్స్ సన్నివేశాలు యుద్ధ సన్నివేశాలు అన్నీ కూడా బాగా ఆకట్టుకున్నాయట. అయితే తెలుగు డైలాగ్స్ బాగా రాసినా కూడా డబ్బింగ్లో కొంతమేరకు మైనస్ కనిపిస్తోందట. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయేలా ఉందని పాటలు పరవాలేదు అనిపించుకున్నాయి.. అలాగే అప్పటి కోటలు ,లొకేషన్స్ చూపించడం కూడా చిత్ర బృందం బాగానే కష్టపడినట్లు కనిపిస్తోంది డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ ఛావా చిత్రాన్ని బాగానే తెరకెక్కించారట. అలాగే శంభాజీ మహారాజ్ కథని మొగల్స్ తో పోరాడి మరణించే వరకు అద్భుతంగా రాసుకున్నారని తెలుపుతున్నారు.
హిందువులను మొగల్ నుంచి కాపాడి పోరాటం చేసిన శంభాజీ మహారాజ్ కూడా మరాఠీ వ్యక్తేనట. హిందువులను కాపాడే సమయంలో మొగల్స్ తో పోరాడి చిత్రహింసలు అనుభవించి వీరమరణం పొందిన మరాఠీ యోధుడిగా పేరుపొందారు శంభాజీ మహారాజ్. ఈ సినిమా చరిత్ర ఆధారంగా తెరకెక్కించారు. ఇందులో ఉండే హై ఎలివేషన్స్ స్లో నెరవేషంతో అద్భుతంగా ఆకట్టుకుంది. చివరి అరగంట మాత్రం శంబాజీ పోరాటంతో పాటు అతనిని చిత్రహింసలు పెట్టిన సన్నివేశాలు ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పించేలా చేస్తున్నాయి. ఇందులో తలకెక్కించిన యుద్ధ సన్నివేశాలు కూడా అద్భుతంగా ఆకట్టుకున్నాయి. ఛావా సినిమా చత్రపతి శివాజీ కుమారుడు చత్రపతి శంబాజీ మహారాజ్ పోరాటయోధుడిగా చూపించారు.. ఈ సినిమా మొత్తానికి తెలుగులో కూడా సక్సెస్ అయిందని కామెంట్స్ చేస్తున్నారు నేటిజన్స్.