
సినిమాలకి కొంచెం దూరంగా ఉండాలి అంటూ నిర్ణయించుకుంది. దానికి కారణం "బేబీ జాన్" మూవీనే. ఎన్నో భారీ ఎక్స్పెక్టేషన్స్ తో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుకు . అయితే తుస్సుమంటూ ఈ సినిమా పేలిపోయింది . ఈ సినిమా రిజల్ట్ ఆమెకు ఎప్పటికీ మర్చిపోలేని ఒక పిడకల అని అంటుంటారు జనాలు. అయితే ఇలాంటి మూమెంట్లోనే కీర్తి సురేష్ - బాలయ్య కాంబోలో రావాల్సిన సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి. ఆ సినిమా మరేంటో కాదు "వీర సింహారెడ్డి".
ఈ సినిమాలో బాలయ్య కు చెల్లెలు పాత్రలో కీర్తి సురేష్ నటించాలి కానీ ఆమె రిజెక్ట్ చేసిందట. అప్పట్లో ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది. క్రాక్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న గోపీచంద్ మల్లినేని దర్శకత్వంలో తెరకెక్కే వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్య హీరోగా హనీ రోజ్ హీరోయిన్గా శృతిహాసన్ హీరోయిన్గా వరలక్ష్మి శరత్ కుమార్ చెల్లెలి పాత్రలో కనిపించి మెప్పించింది. నిజానికి వరలక్ష్మి శరత్ కుమార్ పాత్రలో ముందుగా కీర్తి సురేష్ నే అనుకున్నారట. కానీ ఆమె రిజెక్ట్ చేసిందట . ఒప్పుకొని ఉంటే వేరే లెవెల్ లో ఉండేది . ఈ సినిమా హిట్ అయిన మూమెంట్ కి ఆమె ఈ సినిమా నటించి ఉంటే మాత్రం ఇప్పుడు 100 కోట్ల హీరోయిన్గా మారిపోయి ఉండేది కీర్తి సురేష్..!!