మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా వున్నాడు.. ఎన్టీఆర్ గత ఏడాది “దేవర” సినిమాతో తన కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.. ప్రస్తుతం ఎన్టీఆర్ లైనప్ లో భారీ సినిమాలు వున్నాయి.. ఎన్టీఆర్ ఈ సారి ఎలాంటి గ్యాప్ లేకుండా ఫ్యాన్స్ ని వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధం అవుతున్నాడు..దేవర సినిమా తరువాత ఎన్టీఆర్ పక్కా ప్లానింగ్ తో ముందుకెళ్తున్నాడు.అందుకు తగ్గట్టుగానే రాబోయే మూడు పండుగలకు మూడు సినిమాలను లైన్ లోనే పెట్టేశాడు.ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “వార్ 2”.. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ ఈ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ లో నటిస్తున్నాడు.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబోలో వచ్చే అద్భుతమైన సాంగ్ షూట్ ఇటీవలే మొదలయ్యింది. ఇంకో వారం రోజుల్లో ఆ పాట కూడా పూర్తి అవుతుంది. ఈ సినిమాను మేకర్స్ ఇండిపెండెంట్ డే సందర్భంగా ఆగస్టు 14న రిలీజ్ చేయనున్నారు.

సినిమా తరువాత ఎన్టీఆర్ చేస్తున్న మరో బిగ్గెస్ట్ సినిమా సినిమా డ్రాగన్. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ షూటింగ్ లో ఏప్రిల్ నుంచి రెగ్యులర్ గా ఎన్టీఆర్ అందుబాటులో ఉండబోతున్నాడు..ఈ ఏడాది నవంబర్ లోగా ఈ సినిమా పూర్తి చేసే పనిలో మేకర్స్ ఉన్నారు. ఎట్టి పరిస్థితిలో 2026 సంక్రాంతి పండుగ రోజున ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు.. దీంతో వచ్చే సంక్రాంతి బరిలోకి డ్రాగన్ రావడం గ్యారెంటి అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.

ఎన్టీఆర్ లైనప్ లో ఉన్న మరో క్రేజీ ప్రాజెక్ట్ దేవర-2. ఈ మూవీని ఈ ఏడాది మే, జూన్ లో సెట్స్ మీదకు తీసుకువెళ్లేందుకు మేకర్స్ కసరత్తు చేస్తున్నారు. దేవర ఫస్ట్ పార్ట్ వరల్డ్ వైడ్ గా రిలీజై దాదాపు 500 కోట్ల గ్రాస్ రాబట్టింది. అయితే ఈసారి సెకండ్ పార్ట్ ని మేకర్స్ మరింత భారీగా తెరకెక్కించనున్నారు...అన్నీ కుదిరితే ఈ సినిమా షూటింగ్ జనవరి కల్లా పూర్తి చేసి 2026 దసరాకి దేవర 2 ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ చూస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: