తండేల్ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహించారు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్న సంతోషంలో నాగ చైతన్య ఉన్నారు. ప్రస్తుతం నాగ చైతన్య తన తదుపరి సినిమాను కార్తీక్ వర్మ దండుతో చేయడానికి సిద్ధమయ్యారు. ఇక నాగచైతన్య వివాహం జరిగిన అనంతరం తన కెరీర్ సంతోషంగా సాగుతోంది. శోభిత రాకతో నాగచైతన్య కెరీర్ లో మంచి హిట్ పడింది.
ఈ జంట చాలా కాలం నుంచి ప్రేమలో ఉండి కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక వివాహం జరిగిన చాలా రోజుల తర్వాత నాగచైతన్య, శోభిత ధూళిపాళ హనీమూన్ ట్రిప్ కి విదేశాలకి వెళ్లారు. అక్కడ విదేశాలలో ఎంజాయ్ చేస్తూ వీధులలో చక్కర్లు కొడుతున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను నాగచైతన్య, శోభిత సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా అవి ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు క్యూట్ కపుల్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఇదిలా ఉండగా.... ప్రస్తుతం వీరికి సంబంధించిన ఓ వార్త వైరల్ గా మారుతోంది. నాగచైతన్య, శోభిత త్వరలోనే పిల్లలను కణాలని వివాహానికి ముందే ఫిక్స్ అయ్యారట. అందువల్ల వారు పిల్లల కోసం వెకేషన్ కి వెళ్లినట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక శోభిత త్వరలోనే గుడ్ న్యూస్ షేర్ చేసుకుంటుందని అక్కినేని అభిమానులు సంబరపడుతున్నారు. ఇక ఈ విషయంపైన త్వరలోనే మరింత సమాచారం వెలువడనుంది.