
ఆ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న రవితేజ ఆ సినిమా అనంతరం వెనుతిరిగి చూసుకోకుండా వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ స్టార్ హీరోగా ఎదిగాడు. ఎన్నో సినిమాలలో నటించిన రవితేజ బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం రవితేజ రీసెంట్ గా నటించిన మిస్టర్ బచ్చన్ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది.
ఈ సినిమాతో రవితేజ తన తదుపరి సినిమా షూటింగ్ కు సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. నేను శైలజ, చిత్రలహరి వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు తీసిన దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ హీరోగా తన తదుపరి సినిమాను చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. యాక్షన్ స్టోరీతో తెరకెక్కే ఈ సినిమాని చెరుకూరి సుధాకర్ నిర్మించనున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి.
ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ఏప్రిల్ లేదా మే నెలలో ఈ సినిమా షూటింగ్ సెట్స్ పైనకి వెళ్లనుంది. మరి ఈ సినిమాలో హీరోయిన్ ను ఎంపిక చేసే పనిలో దర్శకుడు ఉన్నారట. త్వరలోనే ఈ సినిమా గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. కాగా, ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని దర్శకుడు ఆలోచనలో ఉన్నారట.