యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో సినిమాలలో నటించిన ఎన్టీఆర్ తనదైన నటన, డ్యాన్స్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ తన కెరీర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ హిట్ సినిమాలలో నటించారు. అదేవిధంగా డిజాస్టర్ సినిమాలను చవిచూశారు. అయినప్పటికీ ఎన్టీఆర్ ఏమాత్రం వినుతిరిగి చూడకుండా వరసపెట్టి సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ హీరోగా ఎదిగిన విషయం తెలిసిందే. 


సినిమా అనంతరం ఎన్టీఆర్ వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నారు. రీసెంట్ గా ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస సినిమా ప్రాజెక్ట్స్ లతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 సినిమాలో నటిస్తున్నారు. అదేవిధంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే సంవత్సరం రిలీజ్ కానుంది. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ కు విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.


అయితే ఎన్టీఆర్ కు వీరాభిమాని అయిన కౌశిక్ అనే వ్యక్తి నిన్న రాత్రి మరణించారు. గత కొంతకాలం నుంచి కౌశిక్ క్యాన్సర్ సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అతని కోరిక మేరకు ఎన్టీఆర్ రీసెంట్ గా కౌశిక్ తో వీడియో కాల్ కూడా మాట్లాడి అతనికి ధైర్యం చెప్పారు. అంతేకాకుండా కౌశిక్ కి వైద్య చికిత్సకు అవసరమైన డబ్బులను ఎన్టీఆర్ సమకూర్చారు.


అయినప్పటికీ కౌశిక్ మరణించడం ప్రతి ఒక్కరిని బాధకు గురి చేస్తోంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం "#wemissyouKaushik"అంటూ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కౌశిక్ మరణం పట్ల ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. కౌశిక్ మరణాన్ని అతని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరి కౌశిక్ మరణం పట్ల ఎన్టీఆర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: