
ఆ సినిమా తర్వాత ఆ రేంజ్ విజయం మళ్ళీ అందుకోలేదు .. చివరగా మా నాన్న సూపర్ హీరో అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు .. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది .. ఇక ఇప్పుడు మరో ఇంటరెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు . ఆ సినిమా పేరే జటాధర .. డిఫరెంట్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా షూటింగ్ కూడా ఎంతో వేగంగా జరుగుతుంది .. అయితే ఈ సినిమాలో ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కూడా నటిస్తుందని తెలుస్తుంది.
ఇంతకి ఆమె మరెవరో కాదు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నా అందాల భామ సోనాక్షి సిన్హా .. ఈ బ్యూటీ ఇప్పుడు సుధీర్ బాబు నటిస్తున్న జటాధర సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తుంది .. తాజాగా ఈ బ్యూటీ ఈ సినిమాలో నటిస్తుందని మేకర్స్ ప్రకటించారు .. ఇటీవీలే ఈ హీరోయిన్ హేరామండి సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది . ఇప్పుడు టాలీవుడ్ లోకి అడుగుపెడుతుంది .. ఇక ఈ సినిమాకు వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం ఇస్తున్నారు .. ప్రేరణ అరోరా సమర్పణలో సుదీర్ బాబు ఈ సినిమాని సొంతంగా నిర్మిస్తున్నారు .. ఈ సినిమాతో అయినా ఈ హీరో సక్సెస్ అందుకుంటాడో లేదో చూడాలి.