గతంలో చిత్ర పరిశ్ర‌మలో టాప్ హీరోయిన్లు ఈమె ఒకరు .. ఒక్కో సినిమాకు భారీగ రెమ్యూనరేషన్ తీసుకుంది .. అప్పట్లో ఈమె ఫాలోయింగ్ ఊహించని రేంజ్ లో ఉండేది .. అతి తక్కువ సమయంలోనే చిత్ర పరిశ్ర‌మ‌లో స్టార్ స్టేటస్ అందుకుంది . అందం అభినయంతో యువతను కట్టిపడేసింది .. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈమెని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు .. ఇదే విషయాన్ని నేరుగా ఆమె ఇంటికి వెళ్లి కూడా చెప్పగా అందుకు ఆమె నో చెప్పింది .. కొన్ని సంవత్సరాల పాటు చిత్ర పరిశ్రమలో చక్రం తిప్పిన ఈ బ్యూటీ ..


ఇప్పుడు బిజినెస్ రంగంలో సత్తా చాటుతుంది .. 4600 కోట్ల ఆస్తితో అత్యధిక ధనిక హీరోయిన్గా నిలిచింది .. ఇంతకీ ఈమె ఎవరు అంటే .. మరెవరో కాదు హీరోయిన్ జుహీ చావ్లా .. గతంలో శ్రీదేవి రేంజ్ లో ఫాలోయింగ్ పెంచుకుంది. ఇక తెలుగులో జుహీ చావ్లా నటించింది కేవలం రెండు సినిమాల్లోనే .. నాగార్జున  హీరోగా వచ్చిన విక్కీ దాదా సినిమాలో ఈమె నటించింది .. అప్పట్లో ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది .. ఆ తర్వాత 1984 మిస్ ఇండియా కిరీటం గెలుచుకున్న జుహీ చావ్లా .. 1986 లో ధర్మేంద్ర , సన్నీడియోల్ , శ్రీదేవి కలిసి నటించిన సుల్తానత్ సినిమాతో వెండితెరకు పరిచయమైంది .. ఆ తర్వాత తెలుగు , హిందీ , మలయాళ భాషలో అవకాశాలు అందుకుంది ..


అయితే హీరోయిన్ గా భారీ స్టార్డం అందుకున్న జుహీ .. తర్వాత నెమ్మదిగా సహాయ పాత్రలో నటించడం మొదలుపెట్టింది . హిందీలో ఈమె ఎన్నో సినిమాలలో నటించింది. ఇక పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న జుహీ చావ్లా .. ఇప్పుడు బిజినెస్ లో సత్తా చాటుతుంది .. ప‌లు నివేదికల ప్రకారం ప్రస్తుతం ఆమె ఆస్తులు దాదాపు 4600 కోట్లుగా ఉన్నట్టు తెలుస్తుంది .. అలాగే షారుఖాన్ తర్వాత అత్యధిక ఆస్తులు కలిగి ఉన్న నటిగా ఈమె రికార్డ్ క్రియేట్ చేసింది .. అలాగే గత 15 సంవత్సరాలుగా చిత్ర పరిశ్రమంలో నటించక పోయిన ఆదాయం మాత్రం బాగా పెంచుకుంది.




మరింత సమాచారం తెలుసుకోండి: