విజయనిర్మల గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. కేవలం ఏడేళ్ల వయసులోనే బాలనటిగా మత్స్య రేఖ అనే తమిళ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. 11 ఏళ్ల వయసులో పాండురంగ మహత్యం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. అనంతరం రంగుల రాట్నం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. తాను నటించిన మొదటి సినిమాతోనే ఉత్తమ నటిగా విజయనిర్మల నంది అవార్డును కైవసం చేసుకున్నారు. విజయ నిర్మల బాలనాటిగా తన కెరీర్ ప్రారంభించి సినీ ఇండస్ట్రీలో వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని అందుకోని మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 

హీరోయిన్ గా వందకు పైగా సినిమాలలో నటించిన విజయనిర్మల హీరో సూపర్ స్టార్ కృష్ణతో ఎక్కువ సినిమాలు చేశారు. ఇక సినిమాలలో నటిస్తున్న సమయంలోనే విజయనిర్మల కృష్ణమూర్తి అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. కొన్ని రోజులు కలిసి ఉన్న వీరు విడిపోయారు. వీరికి నరేష్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. విజయనిర్మలకు సూపర్ స్టార్ కృష్ణతో సినిమాలలో నటిస్తున్న సమయంలో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అనంతరం ఇద్దరూ కలిసి వివాహం చేసుకున్నారు.


అప్పటికే కృష్ణకు కూడా వివాహం జరిగి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినప్పటికీ పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఇక విజయనిర్మల హీరోయిన్ గా మాత్రమే కాకుండా దర్శకురాలిగాను వ్యవహరించారు. అంతేకాకుండా నిర్మాతగాను వ్యవహరించారు. విజయనిర్మల తన కెరీర్ లో 200కు పైగా సినిమాలలో నటించి ప్రేక్షకులను అలరించారు.

అంతే కాకుండా 44 సినిమాలకు పైనే దర్శకత్వం వహించారు. సినీ ఇండస్ట్రీలో విజయ నిర్మల తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. చిత్ర పరిశ్రమలోనే చెరగని ముద్ర వేసుకున్న విజయనిర్మల 2019 జూన్ 26న గుండెపోటుతో మరణించారు. ఆమె మరణం తన కుటుంబ సభ్యులను ఎంతగానో వేధించింది. విజయనిర్మల మరణ వార్త తెలిసి అభిమానులు ఎంతగానో బాధపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: