టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి కాంబినేషన్‌ లో బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. “SSMB” వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ బిగ్గెస్ట్ మూవీని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు.. ఈ సినిమాపై ఫ్యాన్స్ లో విపరీతమైన అంచనాలు వున్నాయి.. ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టిన రాజమౌళి టీం అందరికీ స్ట్రిక్ట్ రూల్స్ పెట్టినట్లుగా సమాచారం.. ఈ సినిమాలో మహేష్ సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంకా చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది.. అలాగే ఈ సినిమాలో మరో స్టార్ హీరో పృద్వి రాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు..

 RRRతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసిన రాజమౌళి, ఇప్పుడు మహేష్‌తో అంతకు మించిన సినిమాను రూపొందిస్తున్నాడు..మహేష్ కెరీర్‌లో ఇదే అతిపెద్ద సినిమా కాబోతుంది.మరి ఈ చిత్రంలో మహేష్ పాత్ర ఎలా ఉంటుందనే దానిపై ఫ్యాన్స్ లో ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో మహేష్‌ పాత్రను అడ్వెంచరస్‌గా డిజైన్‌ చేశారని సమాచారం.ఇది పూర్తిగా యాక్షన్ అండ్ మిస్టరీ తో కూడిన పాత్ర అని టాక్. అంతే కాదు, ఈ సినిమా ప్రధానంగా అడవులు, పురాతన నిధుల వెతుకులాట నేపథ్యంలో నడుస్తుందని సమాచారం...

ఈ మేరకు ఇండియాలోని ఒడిశా, కేరళ, ఆఫ్రికా వంటి ప్రాంతాల్లో భారీ స్థాయిలో షూటింగ్ జరిపేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు..
సినిమా కథలో మహేష్ పాత్రకు ‘రుద్ర’ అనే పేరు ఖరారు చేశారన్న న్యూస్ వైరల్ అవుతుంది..ఈ సినిమాలో అత్యంత గ్రాండ్ విజువల్ ఎఫెక్ట్స్, ఇంటర్నేషనల్ స్థాయి టెక్నాలజీని ఉపయోగించబోతున్నట్లు సమాచారం..త్వరలోనే దర్శకుడు రాజమౌళి ఓ భారీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ సినిమాకు సంబంధించి కీలక విషయాలు తెలియజేయనున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: