
కొన్ని కాంబినేషన్స్ కు ఎక్కడా లేని భారీ క్రేజ్ ఉంటుంది .. అలాంటి కాంబినేషన్స్ లో పవన్ , త్రివిక్రమ్ ఒకరు .. ఇద్దరి కాంబినేషన్లో జల్సా , అత్తారింటికి దారేది సినిమాలు రికార్డులు తిరగరాస్తే .. అజ్ఞాతవాసి మాత్రం డిజాస్టర్ గా మిగిలింది .. అయినా కూడా పవన్ , త్రివిక్రమ్ కాంబో అంటే అభిమానంలో సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది .. ఎందుకంటే ఇద్దరూ కలిస్తే కచ్చితంగా ఏదో మ్యాజిక్ రిపిట్ అవుద్దని వారి నమ్మకం .. ఒక్కోసారి ఈ మ్యాజిక్ మిస్ అవ్వచ్చు ఏమో కానీ క్రేజ్ మాత్రం అలాగే ఉంటుంది .. పవన్ కళ్యాణ్ ప్రజెంట్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు .. ఆయన కమిట్ అయిన సినిమాలు పూర్తి చేయడం కష్టంగా ఉంది .. ఒకవైపు హరిహర వీరమల్లు మరో పక్క ఓ జి.. ఇంకోవైపు ఉస్తాద్ ఇలా చాలా సినిమాల్లో బిజీగా ఉన్నాడు పవన్.
ఇలా ఇంత బిజీలో కూడా పవన్ నుంచి మరో సినిమా అంటే కాస్త కష్టమే కానీ ట్రై చేస్తే అసాధ్యమైతే కాదు .. త్రివిక్రమ్ ప్రస్తుతం అల్లు అర్జున్ సినిమా పనిలో ఉన్నారు . ఆయన కోసమే ఓ భారీ పాన్ ఇండియ కథను రెడీ చేస్తున్నాడు . మైథలాజికల్ టచ్ తో ఉండే ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ కూడా పెడుతున్నారు నిర్మాతలు .. దీని తర్వాత ఓ పొలిటికల్ సినిమా చేయడానికి త్రివిక్రమ్ రంగం సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది .. అది కూడా పవన్ తో ఉండబోతుందని అంటున్నారు .. అలాగే 2029 ఎన్నికలకు ముందే ఆ పొలిటికల్ సినిమా ప్రేక్షకులు ముందుకు తీసుకువస్తావని నిర్మాత నాగ వంశి అన్నారు .. అయితే అది పవన్ కళ్యాణ్ తోనే ఉండబోతుందని .. అప్పటికి అల్లు అర్జున్ సినిమాలు త్రివిక్రమ్ పూర్తి చేయాలని భావిస్తున్నాడు . అన్ని అనుకున్నట్టు జరిగితే 2029 ఎలక్షన్స్ కంటే ముందే పవన్ , త్రివిక్రమ్ సినిమా రావచ్చు .. మరో వైపు త్రివిక్రమ్ కూడా అజ్ఞాతవాసి బాకీ ని తీర్చేయాలని చూస్తున్నాడు.