తనకు వ‌చ్చే ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు సూర్య . తన మనసుకు నచ్చిన కథ వస్తే ఓకే చెప్పేస్తున్నాడు .. ఈ సమయంలోనే ప్రస్తుతం కమీడియన్ కం డైరెక్టర్ ఆర్జే బాలాజీ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు సూర్య .. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఎంతో వేగంగా జరుగుతుంది .. సోషియా ఫాంటసీ నేపథ్యంలో సూర్య 45వ సినిమా రాబోతుంది .. చాలా తక్కువ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు .. ఇక దీనికోసం రెమ్యూనరేషన్ కూడా తీసుకోవట్లేదు సూర్య .. రిలీజ్ తర్వాత బిజినెస్ లో  షేర్ పంచుకోవాలనేది సూర్య ఆలోచన .. ఈ సినిమా స్టోరీ మీద తాజాగా సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ స్టోరీ నడుస్తుంది .. సూర్య ప్రజెంట్ చేస్తున్న సినిమా కు పవన్ కళ్యాణ్ పదేళ్ల క్రితం చేసిన‌ గోపాల గోపాల సినిమాకు లింక్ ఉన్నట్టు తెలుస్తుంది.
 

గతంలో పవన్ , వెంకటేష్ హీరోలుగా నటించిన గోపాల గోపాల హిందీ సినిమా ఓ మై గాడ్ కు రీమేక్ .. అయితే తెలుగులో పవన్ కళ్యాణ్ నటించడు కాబట్టి ఆయన ఇమేజ్కు తగ్గట్టు కొన్ని సన్నివేశాలను మార్చి తీశారు .. ఇక 2017 సంక్రాంతికి వ‌చ్చిన‌ ఈ సినిమా ఓ మాస్త‌రు ఆకట్టుకుంది .. ప్రజెంట్ సూర్య 45 స్టోరీ బ్యాక్ డ్రాప్ కూడా ఈ సినిమాను పోలి ఉంటుందని తెలుస్తుంది .. అలాగే ఈ సినిమాలో సూర్య రెండు క్యారెక్టర్ లో నటించబోతున్నాడట .. ఒకటేమో దేవుడు రెండోది లాయర్ .. కొన్ని ఊహించని పరిస్థితుల్లో  దేవుడు భూమి మీదకు రావాల్సి ఉంటుంది .. అనుకోని సమస్యల్లో చిక్కుకున్న దేవుడు తరుపు వాదించే బాధ్యత ఓ న్యాయవాదిపై పడుతుంది .. అతను కూడా సూర్యనే అప్పుడు దేవుడు లాయర్ మధ్య ఉండే ఎమోషనల్ డ్రామా ఈ సినిమా కథ అని అంటున్నారు .. ఈ పాయింట్ వింటేనే గోపాల గోపాల సినిమా గుర్తుకురాక మానదు .

 

కాకపోతే నేపథ్యం అలాగే ఉన్న స్క్రీన్ ప్లే కంప్లీట్ గా వేరే లాగా డిజైన్ చేశాడట దర్శకుడు బాలాజీ .. నిజానికి ఇదే కథను గతంలో నయనతారతో అనుకున్నడు దర్శకుడు నాలుగేళ్లు కిందట కరోనా సమయంలో నయనతారతో అమ్మోరు తల్లి అనే సినిమాను కూడా తీశాడు ఆర్జే బాలాజీ .  దానికి సీక్వల్ గా ఇప్పుడు తాజాగా మరో తమిళ దర్శకుడు సుందర్ దర్శకత్వంలో మరో సినిమా మొదలైంది ..20 ఎళ్ల‌ తర్వాత ఈ సినిమా ఓపెనింగ్ వచ్చింది నయనతార. ఇప్పుడు సూర్యతో చేస్తున్న సినిమా కథ‌ ఫిమేల్ వెర్షన్ నయనతార తో చేయాలనుకున్నాడు బాలాజీ .. కొని అనుకోని సమస్యల కారణంగా ఫిమేల్ వెర్షన్ కాస్త మెయిల్ వెర్షన్ గా మారిపోయింది .. ఇప్పుడు ఈ రెండిటిలో ఏది ముందు రిలీజ్ అయితే దానికి లాభం .. ఈ రెండు ఒకేసారి వస్తే మాత్రం సినిబాకు గట్టి షాక్కు తప్పదు .. ఈ సినిమాతో అయినా సూర్య కష్టాలు  తీరిపోతాయో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: