
ఇక కీలకమైన ఇంకో మూడు పాటలు బ్యాలెన్స్ ఉన్నాయట వాటిని హడావిడిగా షూట్ చేయడం కుదరదు . హీరోయిన్స్ నిధి అగర్వాల్ మాల్మిక మోహన్ ఇతర కమిట్మెంట్లతో బిజీగా ఉన్నారు .. కాబట్టి కాంబినేషన్ కాల్ షీట్లు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి . ఇదంతా ఈజీగా అయ్యే వ్యవహారం కాదు .. మరోవైపు ఇప్పటిదాకా రెడీ అయిన భాగానికి సంబంధించిన ఫుటేజ్ మూడున్నర గంటల దాకా వచ్చిందట .. దీన్ని ఎడిటింగ్ చేయడం ఎంతో సవాల్ గా మారిందని తెలుస్తుంది . కమర్షియల్ సినిమాలకు ఓకే గాని హారర్ కామెడీ ఇంతనిడివి అంటే కచ్చితంగా సమస్య ఎంత ప్రభాస్ ఉన్నా సరే లేనిపోని రిస్క్ గా మారుతుంది.
సో దీనిబట్టి ఒక పెద్ద పజిల్గా రాజా సాబ్ మారిపోయింది .. 2025 చివరలో విశ్వంభర , స్వయంభు , అఖండ 2 తాండవం , సంబరాలు ఏటిగట్టు , కాంతారావు చాప్టర్ 1 .. ఓజీ లాంటి పాన్ ఇండియా సినిమాలు బోలెడు రాబోతున్నాయి . వీటితో క్లాష్ రాకుండా సోలో డేట్ కావాలనేది ప్రభాస్ అభిమానుల కోరిక .. అలాగే బాలీవుడ్ రిలీజ్ అని కూడా లిస్టులోకి తీసుకోవాలి బాహుబలి తర్వాత సాహో నుంచి కల్కి దాకా ప్రభాస్ వచ్చింది సింగిల్గానే అలా అయితే బడ్జెట్ రికవరీలు వేగంగా జరుగుతాయి .. మరి రాజా సాబ్ తో ఏం చేస్తాడు .. ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనేది కాలమే సమాధానం చెప్పాలి.