ఈమధ్య రీ రిలీజ్ సినిమాలకు క్రేజ్ పెరిగిపోతుంది. రీసెంట్ గా మహేష్ బాబు హీరోగా నటించిన సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా రిలీజ్ చేశారు. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆరెంజ్ సినిమా అయితే ఇప్పటికి రెండు మూడు సార్లు రీరిలీజ్ చేసినప్పటికీ థియేటర్ లు హౌస్ ఫుల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా తీన్మార్ సినిమా రిలీజ్ చేయాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. నిజానికి తీన్మార్ సినిమా అప్పట్లో ఆశించిన మేర విజ‌యం సాధించలేదు. కానీ పవన్ ఫ్యాన్స్ కి మాత్రమే ఈ సినిమా తెగ న‌చ్చేసింది. ఈ చిత్రాన్ని బాలీవుడ్ సినిమా నుండి రీమేక్ చేశారు. 

అంతే కాకుండా బండ్ల గణేష్ ఈ సినిమాను నిర్మించగా త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే మరియు మాటలతో పాటు స్క్రిప్ట్ అందించారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు. సినిమాలోని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. కానీ సినిమా మాత్రం హిట్ కాలేదు. ఇక ఇప్పటికే పవన్ కళ్యాణ్ తొలిప్రేమ, జల్సా, తమ్ముడు, ఖుషి సినిమాలు రీరిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో పవన్ ఫ్యాన్స్ తీన్మార్ సినిమా గురించి బండ్ల గణేష్ ను రిక్వెస్ట్ చేస్తున్నారు.  

ఓ అభిమాని... అన్నా ఏం చేస్తావో ఏమో తెలియదు మాకు తీన్మార్ రీరిలీజ్ కావాలి అంటూ పోస్ట్ పెట్టాడు. అది చూసిన బండ్ల గణేష్ నేను రీరిలీజ్ చేస్తాను బ్రదర్ మీరు బ్లాక్ బాస్టర్ చేస్తారా? అంటూ ప్రశ్నించాడు. దీంతో పవన్ ఫ్యాన్స్ బండ్ల గణేష్ పోస్ట్ చూసి త్వరగా రీరిలీజ్ చెయ్ అన్న కచ్చితంగా బ్లాక్ బస్టర్ చేస్తామంటూ రిప్లై ఇచ్చారు. దీంతో బండ్ల దానికి కూడా రిప్లై ఇచ్చాడు. మూవీ రీరిలీజ్ కి వచ్చిన కలెక్షన్స్ మొత్తం పార్టీకే ఇస్తానని ప్రకటించాడు. ఇక బండ్ల రిప్లై తో తీన్మార్ రీరిలీజ్ క‌న్ఫామ్ అయ్యింది. అయితే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2న‌ ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారని కూడా ప్రచారం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: