నందమూరి కళ్యాణ్ రామ్ ఈమధ్య విభిన్నమైన కథలతో అభిమానులను అలరిస్తూ ఉన్నారు. బింబిసార, డెవిల్ వంటి చిత్రాలతో మంచి విజయాలను అందుకున్నారు. అలాగే హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా పలు చిత్రాలను తెరకెక్కిస్తూ ఉన్నారు కళ్యాణ్ రామ్. ఇప్పటికే తన 21వ సినిమా ప్రకటించి ఈ సినిమాకు సంబంధించి గ్లింప్స్ విడుదల చేయగా ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని కూడా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పైన డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కిస్తూ ఉన్నారు.


సినిమా షూటింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి ఈ సినిమాలోని కీలకమైన పాత్రలో విజయశాంతి నటించబోతోందనే విషయం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తోంది. ఇందులో మరొకసారి విజయశాంతి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతోంది. హీరోయిన్గా సాయి మంజ్రేకర్ నటిస్తోంది. ఇందులో కళ్యాణ్ రామ్ విజయశాంతి తల్లి కొడుకుగా మొదటిసారి కనిపించబోతున్నారట. ఇప్పటికీ ఈ సినిమా టైటిల్స్ విషయంలో పలు రకాల రూమర్స్ కూడా వినిపించాయి. ఈ రోజున ఉమెన్స్ డే  కళ్యాణ్ రామ్ 21వ సినిమాకి సంబంధించి అనౌన్స్మెంట్ కూడా చేశారు చిత్ర బృందం.


ఇక ఈ సినిమా టైటిల్ విషయానికి వస్తే అర్జున్ సన్నాఫ్ వైజయంతి అనే టైటిల్ ని చిత్ర బృందం ఫిక్స్ చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో ఫాన్స్ ఖుషి అవుతున్నారు గతంలో ఎన్నో లేడి ఓరియెంటెడ్ చిత్రాలలో నటించిన విజయశాంతి ఇప్పుడు మరొకసారి ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారని తెలిసి కచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని ధీమాని వ్యక్తం చేస్తున్నారు. ఈ పోస్టర్లో అటు కళ్యాణ్ రామ్, విజయశాంతి ఇద్దరు కూడా చాలా స్టైలిష్ గా నడుచుకుంటూ వస్తూ ఉన్నట్లు కనిపిస్తోంది. మొత్తానికి పోస్టర్ తోనే హైప్ లేపిన కళ్యాణ్ రామ్ మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: