ఒకప్పుడు గ్లామరస్ బోల్డ్ పాత్రలలో ఎక్కువగా నటించిన నటి సోనా ప్రతి ఒక్కరికి సుపరిచితమే సుమారుగా రెండున్నర దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో నటిగా రాణించిన ఈమె తన జీవితం కథ పైన ఒక వెబ్ సిరీస్ ను కూడా తెరకెక్కిస్తుందట. దీనిని స్మోక్ అనే పేరుతో తన డైరెక్షన్ లోనే ఈ వెబ్ సిరీస్ రిలీజ్ చేయబోతోంది. ఇందులో ముఖేష్ ఖన్నా, ఇలవరసు, జీవా రవి తదితరులు ప్రధాన పాత్రలు నటిస్తూ ఉన్నారట. ఈ వెబ్ సిరీస్ గురించి సోనా మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేసింది.


స్మోక్ తెరకెక్కించే క్రమంలో తాను చాలా ఇబ్బందులను చవి చూశానని ఎంతోమంది ఈ సిరీస్ ని సైతం వ్యతిరేకించారని కొంతమంది ఈ ప్రాజెక్టులను ఆపేయాలంటూ తనని బెదిరించారని తెలిపింది. ఆర్థికంగా మోసపోయాను ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాను ఒంటరిగానే ఈ వెబ్ సిరీస్ ని పూర్తి చేశానని చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది నటి సోనా.. ఎవరిపైన ప్రతీకారం తీర్చుకోవడానికో ఈ వెబ్ సిరీస్ తన తీయలేదని.. గ్లామర్ నటి అన్న ఇమేజ్ ని తొలగించుకొని ఒక డైరెక్టర్ గా తనని తాను నిరూపించుకోవాలనుకున్నానని తెలిపింది



ఇకమీదట గ్లామర్ పాత్రలు అసలు చేయకూడదని తన పాత్రకు ప్రాధాన్యత ఉండే పాత్రలనే చేస్తానంటూ వెల్లడించింది నటి సోనా. ఈ వెబ్ సిరీస్ 8 ఎపిసోడ్లుగా తీస్తున్నానని ప్రతి ఎపిసోడ్ కూడా 30 నిమిషాలు ఉంటుందని.. 2010 నుంచి 2015 మధ్యలో తన జీవిత కథ ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ని తెరకెక్కించానని తెలిపింది. అలాగే స్మోక్ వెబ్ సిరీస్ సెకండ్ సీజన్ కూడా ఉంటుందని వెల్లడించింది సోనా. సోనా కుసెలన్ అనే చిత్రంలో వడివేలు భార్యగా కూడా నటించింది. ఆ తర్వాత తదితర చిత్రాలలో తమిళ చిత్రాలతో పాటు మలయాళ చిత్రాలలో కూడా నటించింది. తెలుగులో ఆంధ్రవాల, విలన్ ,ఆయుధం తదితర చిత్రాలలో నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: