
ఇక ఎంతోమంది హీరోల పక్కన జోడిగా నటించిన రాధిక తెలుగు ,మలయాళం, తమిళంలోనే కాకుండా దక్షిణాది భారతదేశాలలో ఎంతో మంది ప్రముఖ హీరోలకు జోడిగా నటించింది. అయితే రాధిక శరత్ కుమార్ వివాహమనంతరం హీరోయిన్గా క్రేజ్ తగ్గడంతో పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగింది. పొలిటికల్ పరంగా కూడా ఎంట్రీ ఇచ్చినప్పటికీ పెద్దగా కలిసి రాలేదనే విధంగా వార్తల వినిపించాయి.. అయితే తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా హీరోయిన్ రాధిక ఒక సర్జరీ గురించి పోస్ట్ షేర్ చేయడం జరిగింది.
అయితే గత రెండు నెలల నుంచి తాను కఠినంగా ఉన్న జీవితాన్ని గడిపానని .. ఈ రెండు నెలలు ఒక యుగంలా గడిపాను అంటూ తెలిపింది.. సినిమా సెట్ లో ఉన్నప్పుడు తన మోకాలికి ఒక గాయమైందని దీంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఇటీవలే సర్జరీ జరిగిందని కూడా తెలియజేసింది రాధిక శరత్ కుమార్.. మొత్తానికి రాధిక సర్జరీ విషయాన్ని ఇలా సడన్గా అభిమానులకు చెప్పడంతో ఆశ్చర్యపోతున్నారు. రాధికానే కాకుండా చాలామంది సీనియర్స్ కూడా ఇప్పటికే పలు రకాల సర్జరీలు సైతం చేయించుకుంటూ ఉన్నారు. మరి సర్జరీ నుంచి కోలుకున్న తర్వాత రాధిక ఏదైనా సినిమాలలో నటిస్తుందో లేకపోతే సీరియల్స్ కే పరిమితమవుతుందో చూడాలి మరి.