తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును ఏర్పరచుకున్న సీనియర్ స్టార్ హీరోలలో విక్టరీ వెంకటేష్ ఒకరు. వెంకటేష్ ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి ఎన్నో సంవత్సరాలుగా తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటుడిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా వెంకటేష్ , అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం అనే ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు.

మూవీ లో ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా ... దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు. బీమ్స్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదల అయిన ఈ మూవీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇలా వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో వెంకటేష్ తన నెక్స్ట్ మూవీ చాలా స్పీడ్ గా స్టార్ట్ చేస్తాడు అని చాలా మంది అనుకున్నారు. కానీ ప్రస్తుతం వెంకటేష్ అనేక మంది కథ రచయితల , దర్శకుల కథలను వింటున్నప్పటికీ ఏదైనా సినిమా ఓకే అయినా కూడా రెండు , మూడు నెలల విశ్రాంతి తర్వాతే మూవీ ని స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే వెంకటేష్ తన తదుపరి మూవీ ని టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయబోతున్నాడు అని ఓ వార్త గత కొన్ని రోజులుగా వైరల్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే వెంకటేష్ , సురేందర్ రెడ్డి కాంబోలో మూవీ ఫిక్స్ కాలేదు అని , ఇవి కేవలం రూమర్స్ మాత్రమే అని మరో వార్త వైరల్ అవుతుంది. లేకపోతే వెంకీ తన తదుపరి మూవీ ని ఏ దర్శకుడుతో చేస్తాడు అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: