న్యాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో గతంలో వచ్చిన “దసరా” సినిమా ఎంతటి భారీ సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ సినిమా నాని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.. ఈ సినిమాతో ఎప్పటి నుంచో కోరుకుంటున్న ఊర మాస్ ఇమేజ్ నాని సొంతం అయింది.... అయితే ఈ సూపర్ హిట్ కాంబినేషన్ లో మరో భారీ మూవీ రాబోతుంది.. “ది ప్యారడైజ్” అనే పవర్ ఫుల్ టైటిల్ తో వస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ టీజర్ ని తాజాగా మేకర్స్ రిలీజ్ చేసారు..ప్రస్తుతం ఈ టీజర్ నెట్టింట సంచలనం సృష్టిస్తుంది..

ముఖ్యంగా ల** కొడుకు అనే పదాన్ని నాని లాంటి స్టార్ హీరో సినిమాలో ఇంత ఓపెన్ గా వాడటం గురించి సోషల్ మీడియాలో  పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.ఇదిలా ఉంటే ఈ టీజర్ లో నాని గెటప్ చాలా డిఫరెంట్ గా వుంది.. రెండు జెడలు వేసుకొని నాని ఎంతో గంభీరంగా కనిపించాడు..అయితే వీడియో లో నాని ఫేస్ సరిగ్గా చూపించకపోయినా పొడవాటి జడలతో నానిని చూపించిన న విధానం అభిమానులను షాక్ కి గురి చేసింది.ఇంత షాకింగ్ మేకోవర్ లో నాని నీ ఫ్యాన్స్ ఎప్పుడూ చూడలేదు..

ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రేక్షకుల ఊహకందని ట్విస్టులు ఉంటాయని తెలుస్తుంది.. తాజాగా ఈ సినిమాలో నాని పాత్ర గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది..ఈ సినిమాలో నాని ట్రాన్స్ జెండర్ గా కనిపిస్తాడని సమాచారం..అయితే వైరల్ అవుతున్న ఈ న్యూస్ పై మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి వుంది..నాని సినిమాకు సంబంధించి వరుస అప్డేట్స్ షూటింగ్ మొదలైన దగ్గర నుంచి ఇస్తానని దర్శకుడు శ్రీకాంత్ తెలిపారు.. ఈ సినిమా ప్రేక్షకులకి సరికొత్త అనుభూతి కలిగిస్తుందని ఆ ఎంతో నమ్మకంగా వున్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: