అమితాబ్ బచ్చన్.. బాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్.. ఇన్నేళ్ల వయసు వచ్చినా కూడా ఇంకా కల్కి సినిమాలో ఎంత ఎనర్జిటిక్ గా నటించారో చెప్పనక్కర్లేదు.ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ఎనర్జీకి చాలామంది అభిమానులు ఫీదా అయ్యారు. అంతేకాదు దర్శక నిర్మాతలతో పాటు ప్రభాస్, కమల్ హాసన్ అక్కడున్న అందరూ కూడా అమితాబ్ బచ్చన్ ఎనర్జీకి హ్యాట్సాఫ్ చెప్పారట. అయితే అలాంటి అమితాబ్ బచ్చన్ తన సినిమాలతో ఇప్పటికే కోట్ల ఆస్తులు సంపాదించారు.ఒకానొక సమయంలో అమితాబ్ బచ్చన్ సంపాదించిన డబ్బులు అన్నీ పోయాయి. తర్వాత మళ్లీ సంపాదించడం మొదలుపెట్టి చివరికి వేల కోట్ల ఆస్తులు సంపాదించి పెట్టారు. ఇక ఒక నివేదిక ప్రకారం..అమితాబ్ బచ్చన్ ఆస్తులు దాదాపు 3,190 కోట్ల ఆస్తులట.. అయితే మరణాంతరం తన ఆస్తులన్నీ అభిషేక్ బచ్చన్ కి మాత్రం కాదు వాళ్లకే నా ఆస్తులు చెందుతాయి అంటూ అమితాబ్ బచ్చన్ రీసెంట్ గా సంచలన వ్యాఖ్యలు చేశారు. 

మరి వారసుడు అభిషేక్ బచ్చన్ కి కాకుండా అమితాబ్ బచ్చన్ ఆస్తులు ఎవరికి చెందుతాయో ఇప్పుడు చూద్దాం..బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ కి స్థిర చర ఆస్తులతో పాటు లగ్జరీ కార్ కలెక్షన్స్, లగ్జరీ విల్లాలు,ఇల్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అమితాబ్ బచ్చన్ కి జల్సా అనే లగ్జరీ ఇల్లు ఉంది. అలాగే 260 కోట్ల విలువ చేసే ప్రైవేట్ జెట్ విమానం,ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి. ఇక ఆయన ఎన్ని కోట్ల ఆస్తులు సంపాదించినా కూడా ఇంకా సినిమాల్లో చేస్తూ అలాగే పలు వ్యాపారాలు కూడా చేస్తూ ఆస్తులు సంపాదిస్తున్నారు. అయితే కౌన్ బనేగా కరోడ పతి అనే షోలో ఈయన తన తదనంతరం తన ఆస్తులు ఎవరికి వర్తిస్తాయో చెప్పుకొచ్చాడు. అయితే చాలా సంవత్సరాలు నుండి కేబీసీ షో కి అమితాబ్ బచ్చన్ హస్ట్ గా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.

అయితే ఈ షోలో తన ఆస్తుల గురించి మాట్లాడుతూ.. తాను మరణించాక తన ఆస్తులన్నీ కేవలం అభిషేక్ బచ్చన్ కి మాత్రమే కాదు తన కూతురు శ్వేతా బచ్చన్ కి కూడా చెందుతాయి. నాకు ఇద్దరు పిల్లలు అందుకే నేను మరణించాక నా ఇద్దరు పిల్లలకి నా ఆస్తులు అన్ని సమానంగా వర్తిస్తాయి అంటూ అమితాబ్ బచ్చన్ మాట్లాడారు. ఇక అమితాబ్ బచ్చన్ మాటలపై చాలా మంది పాజిటివ్ కామెంట్లు పెడుతున్నారు.ఎంతోమంది స్టార్స్, సెలబ్రిటీలు వ్యాపారవేత్తలు కూడా తమ కడుపున పుట్టిన కొడుకులకే పూర్తి ఆస్తిపాస్తులను ఇచ్చి కూతుర్లని పెద్దింటికి ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. కానీ అలాంటిది ఇంత పెద్ద స్టార్ అయిన మీరు కొడుకుకి మాత్రమే కాదు నా కూతురికి కూడా నా ఆస్తిలో సగభాగం వస్తుందని మంచి మాట చెప్పారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: