సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు చాలామందితో డేటింగ్ చేస్తూ ఉంటారు. వారు ఒక్కొక్కరు నలుగురు,ఐదుగురిని మెయింటైన్ చేస్తూ ఉంటారు.అయితే మాజీలతో గొడవలు వచ్చాక బ్రేకప్ చెబితే వారితో ఫ్రెండ్షిప్ ని కంటిన్యూ చేస్తూ ఉంటారు.అలా తాజాగా ఓ హీరోయిన్ కూడా స్టేజ్ మీద తన మాజీ బాయ్ ఫ్రెండ్ ని చూసి ఆపుకోలేక ఏం చేసిందో ఇప్పుడు చూద్దాం.. బాలీవుడ్ నటి శిల్పా శెట్టి అంటే సౌత్ ఇండస్ట్రీలో ఉన్న జనాలకు కూడా తెలిసిన హీరోయినే. ఈ ముద్దుగుమ్మ తన అందం అభినయంతో అటు సౌత్ కి కూడా వెళ్ళింది. అయితే అలాంటి ఈ బ్యూటీ ఇన్నేళ్ల వయసు వచ్చినా కూడా ఇంకా తరిగిపోని అందంతో తన ఫిజిక్ ని మెయింటైన్ చేస్తూ ఇంకా పాతికేళ్ల అమ్మాయిలాగా కనిపిస్తుంది.అయితే అలాంటి ఈ బ్యూటీ మొట్టమొదటిసారి అక్షయ్ కుమార్ తో డేటింగ్ చేసిన సంగతి మనకు తెలిసిందే.

ముఖ్యంగా శిల్పా శెట్టి ఓ ఇంటర్వ్యూలో నా కన్యత్వం పోయిందే అక్షయ్ కుమార్ వల్ల అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఫస్ట్ టైం అక్షయ్ కుమార్ తో డేటింగ్ చేసి సర్వస్వం అర్పించాను అంటూ చెప్పింది. కానీ అక్షయ్ కుమార్ మాత్రం వేరే వాళ్లతో ఎఫైర్ పెట్టుకున్నారని అందుకే వీరిద్దరూ విడిపోయినట్టు వార్తలు వినిపించాయి. ముఖ్యంగా అక్షయ్ కుమార్ రవీనా టాండన్ ని పెళ్లి చేసుకుంటానని ట్వింకిల్ ఖన్నాని లైన్ లో పెట్టి ఆమెను పెళ్లి చేసుకున్నారట. ఇక వీళ్ళు ముగ్గురు కాదు ప్రియాంక చోప్రా ఇంకా కొంతమంది హీరోయిన్లు కూడా అక్షయ్ కుమార్ డేటింగ్ చేసిన లిస్టులో ఉంటారట. ఇక ఈ విషయం పక్కన పెడితే శిల్పా శెట్టి తన మాజీ లవర్ అయినటువంటి అక్షయ్ కుమార్ ని స్టేజ్ మీద చూసి హ్యాపీగా ఫీల్ అయింది.

అయితే కొంతమంది తమ మాజీలను చూస్తే మోసం చేశారు అనే ఉద్దేశంతో అసలు మొహం చూడడానికి కూడా ఇష్టపడరు. అలాగే ఎడమొహం పెడ మొహం పెడుతూ ఉంటారు.కానీ శిల్పా శెట్టి అక్షయ్ కుమార్ లు అలా కాకుండా మేము విడిపోయిన కూడా హ్యాపీగానే ఉన్నాం.మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. మా మనసులో ఎలాంటి చెడు భావన లేదు అంటూ ఇద్దరు కలిసి హ్యాపీగా ఒకరినొకరు పట్టుకొని స్టేజ్ మీదే డాన్స్ చేశారు. అయితే ప్రస్తుతం వీరు ఇద్దరు చేసిన డ్యాన్స్ నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్స్ ఒకరినొకరు మోసం చేసుకున్నారు అనే భావన కూడా వారి లోపల లేదు ఎంతో హ్యాపీగా కలిసిపోయారు. అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: