
సెర్బియాకు చెందిన నటాషా మొదట పలు రియాలిటీ షోలలో నటించిందట.. 2013లో సత్యాగ్రగం అనే బాలీవుడ్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత పలు చిత్రాలలో నటించిన ఇమే క్రికెటర్ హార్దిక్ పాండ్యా తో ఏర్పడిన పరిచయం వల్ల ఆ పరిచయాన్ని ప్రేమగా మార్చుకొని.. వివాహం వరకు దారితీసింది. కొన్నేళ్ల పాటు రిలేషన్ ని మెయింటైన్ చేసిన ఈ జంట కరోనా సమయంలో సైలెంట్ గా వివాహం చేసుకోవడం జరిగింది. కానీ నటాషా వివాహానికి ముందే గర్భవతి అవ్వడంతో వీరు ఎటువంటి హడావిడి లేకుండా పెళ్లి చేసుకున్నారని వీరికి ఒక బాబు కూడా జన్మించారట.
అయితే హార్దిక్ పాండ్యా కంటే తన భార్య ఒక ఏడాది పెద్దదట. అయితే హార్దిక్ పాండ్యా కంటే ముందు ఇమే మరొక వ్యక్తిని కూడా ప్రేమించిందట.. అతను ఎవరో కాదు ప్రముఖ టీవీ నటులలో ఒకరైన ఆలీ గోని.. నటాషా చాలా కాలం పాటు ఆ వ్యక్తితో ప్రేమాయణం నడిపిందని వీరిద్దరూ కలిసి నాచ్ బలియే అనే రియాల్టీ షోలలో కూడా పాల్గొన్నారు. కానీ ఆ తర్వాత వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో విడిపోయారు. అనంతరం నటాషా, హార్దిక్ పాండ్యాతో రిలేషన్ లోకి వెళ్లగా ఆలీ గోని కూడా మరొక టీవీ నటితో ప్రేమలో పడ్డారట.