కొన్ని సంవత్సరాల క్రితం బాలీవుడ్ ముద్దుగుమ్మలు తెలుగు సినిమాల్లో నటించడానికి ఏ మాత్రం ఆసక్తి చూపేవారు కాదు. ఎవరో ఒకరు ఇద్దరు ఇంట్రెస్ట్ చూపిన కానీ వారు పెద్ద స్థాయిలో సక్సెస్ అయినా దాఖలాలు కూడా లేవు. కానీ ప్రస్తుతం మాత్రం తెలుగు సినిమా పరిశ్రమ క్రేజ్ అద్భుతమైన స్థాయిలో పెరిగిపోయింది. మన తెలుగు సినిమా పరిశ్రమ నుండి భారీ సినిమాలు వస్తున్నాయి. అందులో అనేక సినిమాలు అద్భుతమైన విజయాలను కూడా అందుకుంటున్నాయి.

దానితో తెలుగు సినిమాల్లో నటించిన వారికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు కూడా వస్తుంది. దానితో బాలీవుడ్ ముద్దుగుమ్మలు కూడా తెలుగు సినిమాల్లో నటించడానికి అత్యంత ఆసక్తిని చూపిస్తూ వస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే హిందీ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగిస్తున్న అనేక మంది తెలుగు సినిమాల్లో నటించిన సందర్భాలు ఈ మధ్య కాలంలో జరిగాయి. కొంత కాలం క్రితం ప్రభాస్ హీరోగా రూపొందిన సాహో మూవీ లో బాలీవుడ్ స్టార్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటించింది. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ లో ఆలియా భట్ , రామ్ చరణ్ కి జోడిగా నటించింది. ఇక ప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి 2898 AD సినిమాలో దీపికా పదుకోనే ఓ కీలకమైన పాత్రలో నటించింది.

ఇలా వరుస పెట్టి బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ తెలుగు సినిమాల్లో నటిస్తూ వస్తున్నారు. ఈ లిస్టులోకి మరో బాలీవుడ్ ముద్దుగుమ్మ కూడా చేరిపోయింది. ఆమె మరెవరో కాదు సోనాక్షి సిన్హా. ప్రస్తుతం టాలీవుడ్ యువ నటుడు సుధీర్ బాబు "జటాధార" అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో సోనాక్షి సిన్హా నటిస్తోంది. ఈ విషయాన్ని మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. మరి ఈ మూవీ తో సోనాక్షి సిన్హాకు ఎలాంటి గుర్తింపు వస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: