బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ ను సంపాదించుకున్న నటీమణులలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి కియర అద్వానీ ఒకరు. ఈ ముద్దు గుమ్మ హిందీ సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ వైపు ఆసక్తిని చూపించడం మొదలు పెట్టింది. అందులో భాగంగా ఈ బ్యూటీ మొదటగా తెలుగు లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన భరత్ అనే నేను మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది.

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ మూవీ తో కియార అద్వానీ కి కూడా మంచి గుర్తింపు టాలీవుడ్ ఇండస్ట్రీ లో వచ్చింది. ఇక ఆ తర్వాత ఈ బ్యూటీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా రూపొందిన వినయ విధేయ రామ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుసగా రెండు సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ వినయ విధేయ రామ సినిమా తర్వాత మళ్లీ తెలుగు సినిమాల్లో నటించడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు.

అలా చాలా కాలం గడిచిపోయిన తర్వాత రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో స్టార్ట్ అయిన గేమ్ చెంజర్ మూవీ లో ఈ బ్యూటీ హీరోయిన్గా సెలెక్ట్ అయింది. దానితో ఈ మూవీ తో అయిన ఈ ముద్దు గుమ్మకు మంచి విజయం దక్కుతుందేమో అని చాలా మంది అనుకున్నారు. ఇకపోతే ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయిన గేమ్ చెంజర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అలాగే రెండు సార్లు రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమాల్లో హీరోయిన్గా నటించిన కియార అద్వానీ కి రెండు సార్లు కూడా అపజయాలే దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: