మెగాస్టార్ చిరంజీవి హీరోగా విజయశాంతి హీరోయిన్గా బి గోపాల్ దర్శకత్వంలో చాలా సంవత్సరాల క్రితం మెకానిక్ అల్లుడు అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో అక్కినేని నాగేశ్వరరావు ఓ కీలకమైన పాత్రలో నటించాడు. మెగాస్టార్ చిరంజీవి హీరో గా రూపొందిన మూవీ కావడం , అందులో అక్కినేని నాగేశ్వరరావు కీలక పాత్రలో నటించడంతో ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలం అయింది. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ మూవీ తర్వాత చిరంజీవి , గోపాల్ కాంబోలో సినిమా రావడానికి చాలా సమయం పట్టింది. ఇకపోతే మెకానిక్ అల్లుడు మూవీ తర్వాత చిరంజీవి , బి గోపాల్ కాంబోలో ఇంద్ర సినిమా వచ్చింది. చిరంజీవి తో సినిమా అనుకున్న సమయంలో గోపాల్ , చిన్ని కృష్ణ దగ్గర ఉన్న ఇంద్ర కథను విన్నాడట. కానీ అప్పటికే గోపాల్ , బాలకృష్ణ తో సమర సింహా రెడ్డి ,, నరసింహ నాయుడు అనే రెండు ఫ్యాక్షన్ సినిమాలు చేసి ఉండడంతో మరో సారి అలాంటి జోనర్ సినిమానే చిరంజీవి తో తెరకెక్కిస్తే జనాలు చూస్తారా ..? మళ్ళీ మెకానిక్ అల్లుడు లాంటి అపజయం చిరంజీవి కి నా ద్వారా వస్తే బాగుండదు అనే ఉద్దేశంతో ఆ కథతో ఆయన సినిమానే వద్దనుకున్నాడట.

కానీ అదే సమయంలో పరుచూరి గోపాలకృష్ణ ఈ కథతో చిరంజీవితో నువ్వు సినిమా చెయ్ ... కచ్చితంగా అద్భుతమైన విజయాన్ని అందుకుంటుంది అని పరుచూరి గోపాలకృష్ణ , గోపాల్ కి సలహా ఇచ్చాడట. ఆ సలహాతో గోపాల్ , చిన్ని కృష్ణ దగ్గర ఉన్న కథలో కొన్ని మార్పులు , చేర్పులు చేసి ఇంద్ర అనే టైటిల్ తో మూవీ ని రూపొందించగా అది బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నట్లు పరుచూరి గోపాలకృష్ణ ఓ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: