ప్రస్తుత కాలంలో సినిమా థియేటర్లలో కంటే ఓటిటి ప్లాట్ ఫామ్ లోనే ఎక్కువగా నడుస్తోంది. చాలామంది జనాలు టైం లేక సినిమాలను థియేటర్ కు వెళ్లి చూడలేక ఓటీటీ ద్వారానే వీక్షిస్తున్నారు. అలా ఓటిటి ప్లాట్ఫార్మ్ కు విపరీతమైనటువంటి ఫాలోయింగ్ పెరిగింది. కేవలం సినిమాలే కాకుండా ఇతర వీడియోలను కూడా సోషల్ మీడియా ద్వారానే చాలామంది వీక్షించడం వల్ల కోట్లాదిమంది ఫాలోవర్స్ పెరిగిపోతున్నారు. తాజాగా మనకున్న సమాచారం ప్రకారం ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ ను ఎన్ని కోట్ల మంది వీక్షిస్తున్నారు అనే వివరాలు చూద్దాం.. సాధారణంగా సినిమా వస్తే ఎంతమంది చూశారో తెలియదు. వాళ్ళు చెప్పిన  లెక్కలనే నమ్ముతాం. 

కానీ యూట్యూబ్ ఓటిటి ప్లాట్ ఫామ్ ను మాత్రం ఎంతమంది చూశారు అనేది బహిరంగంగానే కనిపిస్తుంది. ప్రస్తుతం ఓటీటీని వీక్షించేవారు కోట్లలోనే ఉంటున్నారు. వీరి ఆదాయం కూడా విపరీతంగా పెరిగిపోతుంది. ఇండియాలో యూట్యూబ్ ద్వారానే 45.4 కోట్ల మంది వీక్షిస్తున్నారు. ఫేస్బుక్ ద్వారా 32.4 కోట్ల మంది వీక్షిస్తున్నారు. జియో స్టార్ ఓటిటి యాప్  దాదాపు 18 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. నెట్ ఫ్లిక్స్ 4.7 కోట్ల మంది చూస్తున్నారు. సోనీ లివ్ 2000 కోట్ల మంది చూస్తున్నారు.

జీ5 5.2 కోట్ల మంది చూస్తున్నారు. ఆదాయం పరంగా యూట్యూబ్ దాదాపు 14,300 కోట్లు అర్జిస్తుంటే మెటా 6,300 కోట్లు జియో స్టార్ 6,100 కోట్లు, నెట్ ఫ్లిక్స్ 3,900 కోట్లు, అమెజాన్ ప్రైమ్ 2,800 కోట్లు, సోనీ లీవ్ 1,700 కోట్లు, జి ఫైవ్ 919 కోట్లు ఆదాయాన్ని కొల్లగొడుతున్నాయి. అంతేకాకుండా సినీ ప్రియులు కూడా థియేటర్లకు వెళ్లి ఇబ్బంది పడే కంటే ఓ నెల రోజులు ఆగితే ఓటీటిలోకి వస్తుంది తీరిగ్గా చూడొచ్చు అనే ఉద్దేశంతో ఉన్నారు. అందుకే ఓటిటిలు చూసేవారి సంఖ్య పెరగడంతో పాటు వారికి అధికంగా లాభాలు కూడా వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: