ఏంటి చిరంజీవి పై మళ్లీ సోషల్ మీడియాలో విమర్శలు వెలువెత్తుతున్నాయా? ఎందుకు చిరంజీవిపై మళ్ళీ ట్రోలింగ్ జరుగుతుంది.. నీ కొడుకుదే ప్రాణం కానీ వారిది ప్రాణం కాదా అంటూ చిరంజీవిని సోషల్ మీడియాలో ఎందుకు ఏకిపారేస్తున్నారు అనేది ఇప్పుడు చూద్దాం.ఈ మధ్యకాలంలో చిరంజీవిపై నెగెటివిటీ ఎక్కువగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఆయన మాటల వల్ల చాలా విమర్శలకు గురవుతున్నారు. అలాగే గేమ్ ఛేంజర్ ఫ్లాప్ అయినప్పటినుండి కూడా మెగా ఫ్యామిలీ ట్రోలింగ్ ని ఎదుర్కొంటుంది. అయితే ఒక వర్గం ప్రజలు అంటే మెగా ఫ్యామిలీ అంటే ఇష్టం లేని నెటిజన్స్ కావాలనే సోషల్ మీడియాలో నెగిటివ్ పోస్టులు పెడుతున్నారు.అయితే ఈ పోస్టులపై ఎప్పటికప్పుడు మెగా ఫ్యాన్స్ కూడా తిప్పి కొడతారు. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి మహిళా దినోత్సవం సందర్భంగా తన తల్లి,తన చెల్లెళ్లు,తన తమ్ముడితో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

అయితే ఆ ఇంటర్వ్యూలో చిరంజీవి మాట్లాడిన మాటలు ట్రోలింగ్ కి గురయ్యాయి.మరి చిరంజీవి ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం.. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. నేను గూండ సినిమా షూటింగ్ సమయంలో రాజమండ్రిలో రెండు ట్రైన్ల మధ్య ఓ సీన్ చేస్తున్నాను. అయితే ఈ సినిమా షూటింగ్ చూడ్డానికి మా నాన్నగారు కూడా అక్కడికి వచ్చారు.అయితే రెండు ట్రైన్ల మధ్య నేను సీన్ చేసేసరికి అది చూసి మా నాన్న తిట్టారు. ఎందుకు అంత పెద్ద రిస్క్ చేస్తున్నావు. ఏదైనా జరిగితే ఏమవుతుందో నీకు తెలుసా అంటూ నాకు వార్నింగ్ ఇచ్చారు. కానీ నేను మాత్రం అన్ని జాగ్రత్తలు తీసుకునే సన్నివేశాల్లో నటిస్తున్నాను నాన్న అని చెప్పాను.అయినా కూడా నాన్న వినకుండా నీకు ఇప్పుడు అర్థం కాదురా.. నీ కొడుకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు తండ్రిగా నేను పడ్డ బాధ ఏంటో అర్థం అవుతుంది అని చెప్పాడు. 

ఇక మా నాన్న చెప్పిన మాటలు నాకు రాంచరణ్ విషయంలో గుర్తుకు వచ్చాయి. చెర్రీ మగధీర సినిమా షూటింగ్ సమయంలో గుర్రపు స్వారీ చేస్తున్నప్పుడు రోడ్డుమీద పడిపోయాడు. ఆ టైంలో నాకు చాలా బాధేసింది.అలాగే ఆ సినిమా షూటింగ్లో బైక్ స్టంట్ చేసేటప్పుడు పీటర్ హెయిన్స్ కి తీవ్ర గాయాలయ్యాయి. కానీ పీటర్ హెయిన్స్ స్థానంలో చరణ్ ఉంటే ఎలా ఉండేది అని ఆలోచించుకొని, పీటర్ కి తగిలిన దెబ్బలు చరణ్ కి తగిలితే ఆ పరిస్థితి ఎలా ఉండేది అని ఆలోచించుకొని భయమేసింది. అప్పుడు మా నాన్న చెప్పిన మాటలు గుర్తొచ్చాయి అంటూ చిరంజీవి మాట్లాడారు. అయితే ఈ మాటలపై చాలామంది నెటిజన్లు మీ కొడుకుదే ప్రాణమా పీటర్ హేయిన్ ది ప్రాణం కాదా అంటూ నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: