ఇటీవలే ప్రముఖ సింగర్ కల్పన అధిక మోతాదులలో నిద్ర మాత్రలు మింగి ఒక్కసారిగా ఇమే అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో అభిమానులు కొంతమేరకు భయభ్రాంతులకు గురయ్యారు. కానీ చివరికి వైద్యులు మాత్రం ఎలాంటి ప్రాణాపాయం లేదంటూ తెలియజేశారు. అయితే అప్పటికి సింగర్ కల్పన పైన ఎన్నో రకాల రూమర్స్ కూడా వినిపించాయి.. ముఖ్యంగా కుటుంబ సభ్యుల ఒత్తిడి వల్లే ఈమె మరణించింది అనే విధంగా కూడా వార్తలు వినిపించాయి.. ఈమె పైన పలు రకాల వార్తలు వినిపించడంతో తాజాగా ఇమే తెలంగాణ మహిళా కమిషన్ ను కూడా ఆశ్రయించినట్లు తెలుస్తోంది.


తనపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు జరుగుతున్నాయనే విధంగా ఇమే ఫిర్యాదు చేసిందట.. తన పైన వస్తున్న ఇలాంటి ఫేక్ న్యూస్ ని వెంటనే ఆపాలి అంటూ తెలంగాణ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసిందట.ఎవరు కూడా నిజాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని వాటిని అడ్డుకోవాలని కోరిందట.. తాను నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకోవాలనే ప్రయత్నించానే విధంగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ సైతం అసత్య ప్రచారాన్ని వైరల్ గా చేస్తున్నారు. తనకు సంబంధించిన కొన్ని ప్రైవేటు వీడియోలను కూడా అప్లోడ్ చేస్తూ వ్యక్తిగత జీవితాన్ని ఇబ్బందుల్లోకి గురి చేస్తున్నారంటూ ఆమె ఫిర్యాదులు వెల్లడించిందట.


వెంటనే ఇలాంటి అసత్య ప్రచారలు చేసిన ఛానల్ పైన చర్యలు తీసుకోవాలని తనకు భరోసా కల్పించాలంటు మహిళా కమిషనర్ని రిక్వెస్ట్ చేసిందట సింగర్ కల్పన.. పోలీసుల సహాయంతోనే ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్ళింది. ప్రస్తుతం కోలుకుంటున్నా కల్పన .. తాను ఎలాంటి ఆత్మహత్య చేసుకోలేదని కేవలం నిద్ర మాత్రల డోస్ కొంచెం మేరకు ఎక్కువ అవడంతో ఇలా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాను అంటూ వెల్లడించింది.. గత కొంతకాలంగా తనకు ఒత్తిడి కారణంగానే నిద్ర పట్టేది కాదని అందుకే నిద్ర మాత్రలు వేసుకున్నానని వెల్లడించింది. మరి ఇకనైనా కల్పన వార్తలకుచెక్ చేపడుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: