పాన్ మసాలా యాడ్ చేసిన బాలీవుడ్ హీరోలకు షాక్ తగిలింది. జైపూర్ వినియోగదారుల కమిషన్ పాన్ మసాలా యాడ్స్ తో తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారని బాలీవుడ్ హీరోలు షారుఖ్ ఖాన్, టైగర్ షార్ఫ్, అజయ్ దేేవ్ గన్ లతో పాటూ సదరు పాన్ మసాలా సంస్థలకు నోటీసులు జారీ చేసింది. పలుకులలో కేసరి అంటూ హీరోలు పాన్ మసాలా యాడ్ లో చెప్పిన సంగతి తెలిసిందే. కానీ ఈ ప్రకటన తప్పుడు ప్రకటన అని ప్రజల ఆరోగ్యానికి హానికలిస్తుందని యోగేంద్ర సింగ్ బడియాల్ అనే ఫిర్యాదు దారుడు కంప్లైంట్ ఇచ్చాడు. దీంతో మార్చి 19న విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేేశించింది. 

విచారణకు హాజరవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషన్ చైర్మెన్ గైర్సిలాల్ మీనా, సభ్యురాలు హేమలత అగర్వాల్ నోటీసుల్లో పేర్కొన్నారు. 30 రోజుల్లోపూ వివరణ ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది. యాడ్ చూసి ప్రజలు పాన్ మసాలాలను విపరీతంగా తింటున్నారని దీని వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. క్యాన్సర్ లాంటి తీవ్రమైన వ్యాధులకు ఇది కారణం అవుతుందని మండిపడ్డారు. ఇలాంటి యాడ్స్ తో బేబీ ఇండస్ట్రీస్ కోట్లాది రూపాయలు సంపాదిస్తోందని పేర్కొన్నారు.

కుంకుమ పువ్వుతో కూడిన గుట్కా పేరుతో విమల్ పాన్ మసాలా కొనుగోలు చేసేందుకు ప్రజలను చూపిస్తున్నారని పేర్కొన్నారు. ప్రకటనల్లో చెప్పినట్టు అందులో ఎలాంటి కుంకుమ పువ్వు మిశ్రమం లేదని ఆరోపించారు. కుంకుమ పువ్వు ధర కేజీ రూ.4 లక్షలు ఉంటే పాన్ మసాలా ధర రూ.5 ఉందని చెప్పారు. తప్పుడు ప్రచారంతో ప్రజలను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. కాబట్టి తప్పుడు ప్రచారాలు చేస్తున్న నటులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే తెలుగులో మహేశ్ బాబు సైతం పాన్ మసాలా యాడ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఆయనపై కూడా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: