
మరి ఇంతకీ ఆ కండిషన్లు ఏంటంటే..రాఘవ లారెన్స్ నాగార్జున తో మాస్ మూవీ చేయాలి అనుకున్నప్పుడే మెయిన్ హీరోయిన్ గా జ్యోతిక ని ఫిక్స్ చేసుకున్నారట.అయితే దీనికి నాగార్జున కూడా ఓకే చేశారు. ఇక జ్యోతిక దగ్గరకి వెళ్లి లారెన్స్ నాగార్జున సినిమాలో హీరోయిన్ అని చెప్పడంతో నో నేను నటించను అని చెప్పారట. ఎందుకంటే అప్పట్లో నాగార్జునతో వచ్చే సినిమాలన్నీ చాలా రొమాంటిక్ గా ఉండేవి.అందుకే జ్యోతికను కూడా అలా రొమాంటిక్ సీన్స్ లో ఎక్కడ నటింపజేస్తారో అని భయంతో రిజెక్ట్ చేసిందట. కానీ లారెన్స్ మాత్రం ఈ సినిమాకి మీరే పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పడంతో ఈ సినిమాలో నేను చేస్తాను కానీ కొన్ని కండిషన్స్..
ఈ సినిమాలో నేను ఎక్కువ గ్లామర్ పాత్రలో కనిపించను. అలాగే పొట్టి పొట్టి బట్టలు కూడా వేసుకోను. అలాగే మితిమీరిన రొమాంటిక్ సన్నివేషన్లో కూడా చేయను. వీటికి ఒప్పుకుంటేనే నేను ఈ సినిమాలో నటిస్తాను అని చెప్పారట. దాంతో లారెన్స్ చేసేదేమీ లేక ఓకే చేశారట. అయితే నాగార్జున మూవీకి జ్యోతిక ఇన్ని కండిషన్లు పెట్టడానికి కారణం అప్పటికే జ్యోతిక సూర్యతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది. ఈ కారణం వల్లే జ్యోతిక నాగార్జున మూవీకి కండిషన్లు పెట్టిందట. అయితే మాస్ మూవీకి జ్యోతిక కండిషన్ల మీద నటించినప్పటికీ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ కొట్టింది.