
-
Akkineni Nageswara Rao
-
allu ramalingaiah
-
Audience
-
CBN
-
Chanakya
-
chanakya-movie-2019
-
Chiranjeevi
-
Cinema
-
Gandikota
-
girija
-
Heroine
-
jamuna
-
Jr NTR
-
Kathanam
-
king
-
krishna
-
Music
-
NTR
-
pragathi
-
producer
-
Producer
-
rachana
-
rajanala
-
rajasri old
-
sobhan babu
-
Tamilnadu
-
television
-
Telugu
-
Thikka
-
vijayalakshmi
-
vyjayanthi
అయితే ఆ సినిమా పెద్దగా ఆడలేదు ఎన్టీఆర్ తో తర్వాత సినిమా నిర్మించాలని అనుకున్నారు. అప్పుడు ఎన్టీఆర్ సలహా మేరకు డి.వి.యస్ ప్రొడక్షన్స్ సంస్థను మొదలుపెట్టారు .. అలా మొదటి ప్రయత్నంగా విఠలాచార్య దర్శకత్వంలో మంగమ్మ శపథం సినిమాను నిర్మించారు .. ఇక ఈ సినిమా 1965 మార్చ్ 6వ తేదీన రిలీజ్ అయ్యి భారీ విజయంగా నిలిచింది. ఒక తెలుగులోనే కాదు దక్షిణాదిన మంగమ్మ శపథం కథ జనాల మదిలో గొప్పగా నిలిచిపోయింది . ఇక ఈ కథతోనే 1943లో తమిళనాడు మంగమ్మ శపథం అనే సినిమా వచ్చింది . ఇక ఈ సినిమాలో అందాల తారగా జేజేలు అందుకున్న వైజయంతి మాల తల్లి వసుంధర మంగమ్మగా నటించారు .. అయితే ఆ పాత్రనే తెలుగులో జమున నటించి అలరించారు .. తనను లోబరుచుకోవడానికి రాజు చేసిన ప్రతిజ్ఞకు మంగమ్మ శపధం చేసి ఎలా నెరవేర్చుకుంది అనేదే స్టోరీ .. ఇక ఈ స్టోరీని విఠలాచార్య తెర్కక్కించిన తీరు తెలుగువారిని విశేషంగా ఆకట్టుకుంది .. సముద్రాల జూనియర్ ఈ సినిమాకి రచన చేశారు .. టీవీ రాజు సంగీతం అందించిన ఈ సినిమాకు కొసరాజు , సి.నారాయణరెడ్డి పాటలు రాశారు . ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేసిన ఈ సినిమాలో మరో హీరోయిన్ ఎల్ విజయలక్ష్మి నటించారు .. మిగిలిన పాత్రలో రేలంగి , గిరిజ , రమణారెడ్డి , రాజనాల , అల్లు రామలింగయ్య నటించారు.. ఈ సినిమాలో వచ్చే స్పెషల్ సాంగ్ లు రాజశ్రీ కనిపించి మెప్పించారు.
డివియస్ ప్రొడక్షన్స్ లో తొలి సినిమాగా వచ్చిన మంగమ్మ శపథం ఘనవిజయ అందుకుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ తో డివియస్ రాజు పిడుగు రాముడు, తిక్క శంకరయ్య, గండికోట రహస్యం, చిన్ననాటి స్నేహితులు, ధనమా దైవమా వంటి సినిమాలను నిర్మించారు .. ఈ సినిమాలన్నిటికీ టీవీ రాజు సంగీతం అందించారు .. వీటిలో ఓ సినిమా మినహ అన్ని సినిమాలు కమర్షియల్ గా మంచి విజయాలు అందుకున్నాయి . ఆ తర్వాత కాలంలో శోభన్ బాబు , కృష్ణ , కృష్ణంరాజు , చిరంజీవి ,బాలకృష్ణ వంటి హీరోలతోనూ డివియస్ ప్రొడక్షన్స్ సినిమాలో నిర్మించింది. అయితే ఈ సంస్థ నుంచి "జీవనజ్యోతి, దేవుడులాంటి మనిషి, జీవితనౌక, కాలాంతకులు, ప్రెసిడెంట్ పేరమ్మ, అల్లుడు పట్టిన భరతం, ముఝే ఇన్సాఫ్ చాహియే, చాణక్య శపథం, భానుమతిగారి మొగుడు, దోషి-నిర్దోషి, ఛాంపియన్, రాజధానిష .. వంటి సినిమాలు వచ్చాయి .. వీటిలో ఎన్నో సినిమాలు ప్రేక్షకులు ఆకట్టుకున్నాయి . ఇక డివీయస్ ప్రొడక్షన్ సంస్థకు శ్రీకారం చుట్టిన మంగమ్మ శపథం తెలుగువారి మనసులో గొప్ప సుస్థిర స్థానం సంపాదించుకోవడం ఇక్కడ మరో విశేషం.