
రామ్ చరణ్ హీరోగా సమంత హీరోయిన్గా నటించిన ఈ సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది . రామ్ చరణ్ కెరియర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా ఆయనకు స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచేలా చేసింది . ఇక సుకుమార్-సమంత విష్యంలో ఈ సినిమా చేసిన మ్యాజిక్ అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమాలో జిగేలురాణి పాట హైలెట్గా మారింది . ఈ సినిమాలో ఎన్నో ఎన్నో మంచి పాటలు ఉన్నా సరే జిగేలురాణి పాడిన పాట ఎక్కువగా లైక్ చేశారు జనాలు .
అయితే ఈ జిగేలు రాణి పాటలో నటించింది హీరోయిన్ పూజా హెగ్డే. పూజా హెగ్డే జిగేల్ రాణి పాటలో చించేసింది అనే చెప్పాలి. మరి ముఖ్యంగా ఆ నాటీ పదాలతో సాగే లిరిక్స్ బాగా జనాలను బాగా ఆకట్టుకున్నాయి . పూజా హెగ్డే ఒళ్ళుని గిరగిరా తిప్పేస్తూ డాన్సులు వేసింది . అయితే ఈ సినిమాలో ముందుగా జిగేల్ రాణి పాట కోసం హీరోయిన్ కీర్తి సురేష్ ని అనుకున్నారట సుకుమార్ . కానీ ఆమె రిజెక్ట్ చేయడంతో ఈ పాట పూజా హెగ్డే ఖాతాలో పడింది అంటూ అప్పట్లో టాక్ వినిపించింది . మొత్తానికి పూజ హెగ్డే ఈ పాటతో మంచి ఆఫర్స్ ని తన ఖాతాలో వేసుకునేలా చేసుకుంది..!