గతంలో తెలుగు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన‌ చిన్నారులు ఇప్పుడు వెండితెరపై తమ సత్తా చూపిస్తున్నారు .. హీరో , హీరోయిన్లుగా వరస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు .. చైల్డ్ ఆర్టిస్టులుగా ప్రేక్షకుల మనసులో మంచి స్థానం సంపాదించుకున్నారు .. అయితే ఇప్పుడు పైన ఫోటోను చూస్తున్నారు కదా అందులో ఎన్టీఆర్ తో కలిసి ఉన్న చిన్నారి ఎవరో కనిపెట్టారు ? తెలుగులో ఎన్నో హిట్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది .. తన అమాయకమైన నటనతో ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంది ..


ఇక ఈ చిన్నారి పేరు గ్రీష్మ నేత్రిక .. ఎన్టీఆర్ నటించిన అశోక్ సినిమాలో ఈ చిన్నది నటించింది .. అలాగే విక్టరీ వెంకటేష్ నటించిన మల్లీశ్వరి సినిమాలోను ఈ చిన్నది నటించింది .. ఈ సినిమాలో వెంకటేష్ అన్న కూతురుగా నటించింది ముద్దు ముద్దు మాటలతో తన అమాయకమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాలో నటించి అదరగొట్టింది .. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించిన గ్రీష్మ ఇప్పుడు హీరోయిన్ లుక్ లోకి మారిపోయింది .. అలాగే ఆమె మేకోవర్ చూసి అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు ..


సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటూ రెగ్యులర్గా తన మోడ్రన్  అల్ట్రా క్రేజీ ఫొటోస్ ను షేర్ చేస్తుంది .. తాజాగా ఈ బ్యూటీ ఫొటోస్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది ..  అయితే ఈ బ్యూటీ తెలుగులో మల్లీశ్వరి , అశోక్ , కొంచెం ఇష్టం కొంచెం కష్టం , ప్రస్థానం , పంచాక్షరి , ఏమో గుర్రం ఎగరవచ్చు సినిమాలో  చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది గ్రీష్మ .. ప్రస్తుతం ఈ చిన్నది సినిమాలకు దూరంగా ఉంది .. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్గా ఉంటూ వరుస‌ ఫోటోలను షేర్ చేస్తూ అందరికీ షాక్ ఇస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: