
ఐశ్వర్య రాజేష్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు .. తెలుగు అమ్మాయి అయినప్పటికీ తమిళం లో వరుస సినిమాలు చేస్తూ స్టార్డం తెచ్చుకుంది .. కోలీవుడ్ స్టార్ హీరోలతో కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాలో నటించింది . అయితే తమిళంలో వరుస అవకాశాలు వచ్చినప్పటికీ తెలుగులో మాత్రం అంతగా అవకాశాలు రాలేదు .. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా తర్వాత అంతగా అవకాశాలు అందుకోలేదు .. కానీ ఇప్పుడు తెలుగులో ఎక్కువగా మారుమోగుతున్న పేరు ఐశ్వర్య రాజేష్ . స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం భారీ విజయం అందుకుంది ..
ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాలో భాగ్యం పాత్రలో తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. అయితే ఐశ్వర్య రాజేష్ చిన్నతనం లోనే తెలుగులో ఓ సినిమా చేసింది .. నట కిరీటి రాజేంద్రప్రసాద్ నటించిన రాంబంటు సినిమాలో ఐశ్వర్య రాజేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది .. తెలుగు అమ్మాయి అయినా తమిళ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత కౌసల్య కృష్ణమూర్తి సినిమా తో టాలీవుడ్ కు పరిచయమైంది. ఆ తర్వాత వరల్డ్ ఫేమస్ లవర్ , టాక్ జగదీష్ సినిమాలో నటించింది .. ఇక ఇప్పుడు సంక్రాంతి వస్తున్నాం సినిమాతో తెలుగు ప్రేక్షకుకు కూడా దగ్గరయింది.