
పుష్ప2 సినిమా సుకుమార్ కెరీర్ లోనే ఒక మైల్ స్టోన్ క్రియేట్ చేసిందని చెప్పాలి . ఫ్యూచర్లో సుకుమార్ ఎన్ని సినిమాలు తెరకెక్కించిన పుష్ప2 లాంటి ఒక సినిమా భవిష్యత్తులో తెరకెక్కించలేడు అని అంటున్నారు అభిమానులు . ప్రజెంట్ సుకుమార్ రామ్ చరణ్ తో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు . ఈ సినిమాకి సంబంధించిన వార్తలు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి . రకరకాల బజ్ ఈ సినిమాపై క్రియేట్ అవుతుంది. అయితే రామ్ చరణ్ - సుకుమార్ కాంబోలో ఇదివరకే రంగస్థలం సినిమా వచ్చింది . ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అయింది .
అప్పటివరకు రామ్ చరణ్ ని ఒక హీరోగా మాత్రమే చూశారు. కానీ ఆయనలో దాగున్న ఒక మంచి నటుడిని బయటకు తీశాడు సుకుమార్ . అయితే ఈ సినిమా ఇప్పుడు రంగస్థలం 2 గా తెరకెక్కబోతుందని అంత అనుకున్నారు . కానీ కాదు అంటూ బయటపడింది . రంగస్థలం సినిమాకి ఈ సినిమాకి ఎటువంటి సంబంధం లేదు అని ..ఇది పూర్తిగా రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కబోతున్న సినిమా అంటూ ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది . కాగా అసలు ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరిని చూస్ చేసుకున్నారు అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.
చాలామంది సమంత - రష్మిక మందన్నాల పేర్లు మాట్లాడుకుంటున్నారు . అయితే ఈ ఇద్దరిని కూడా ఈ సినిమాలో హీరోయిన్లుగా పెట్టబోతున్నారట సుకుమార్ . అంతేకాదు ఈ సినిమాలో మరొక క్రేజీ క్యారెక్టర్ కోసం జాన్వికపూర్ ని కూడా చూస్ చేసుకున్నారట. ముగ్గురు బ్యూటీస్ తో ఆయన ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారట . అదే జరిగితే మాత్రం ముగ్గురు పాన్ ఇండియా హీరోయిన్స్ ని ఒకే సినిమాలో చూపించిన ఘనత సుకుమార్ కి దక్కుతుంది. ఇదే విషయం ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు జనాలు . చూద్దాం మరి సుకుమార్ ఈ క్రేజీ రికార్డ్ ని ఎలా సెట్ చేస్తాడు అనేది..????