చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీలు పలు రకాల యాడ్స్ వంటివి చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఐపీఎల్ సీజన్ లో ఎన్నో యాడ్సులు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఎక్కువగా ఇందులో విమల్ ,పాన్ మసాలా యాడ్స్ కూడా అగ్ర హీరోలు వంటి వారు చేస్తూ ఉన్నారు. నార్త్ రాష్ట్రాలలో విమల్ వాడకం ఎక్కువగా ఉన్నది. అయితే ఈ యాడ్ చేసిన ముగ్గురు బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం (అజయ్ దేవగన్, షారుఖ్ ఖాన్, టైగర్ ష్రాఫ్) వంటి హీరోల పైన తాజాగా జైపూర్ జిల్లాలో వివిధ మండలాలలో కేసు నమోదు అయిందట.


దీంతో అక్కడి నుంచి ఈ స్టార్ హీరోలకు నోటీసులు వచ్చాయట. మార్చి 19న తమ ముందు హాజరుకావాలని నోటీసులలో తెలియజేశారట. తప్పుడు యాడ్స్లలో నటించినందుకు గాను ఈ ముగ్గురు హీరోలకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. విమల్, పాన్ మసాలా యాడ్లలో హీరోలు నటిస్తున్న సమయంలో.. పలుకు పలుకులో కేసరి అంటూ చెబుతూ ఉన్నారు. దీంతో యోగేంద్ర సింగ్ బడియాల్ అనే ఒక వ్యక్తి జైపూర్లో పిటిషన్ వేశారట.అజయ్ దేవగన్, షారుఖ్ ఖాన్, టైగర్ ష్రాఫ్  ప్రకటనలలో పాన్ మసాలాలు కేసరి ఉందని చెబుతున్నారు అంటూ వెల్లడించారు..


అయితే కేసరి ధర ప్రస్తుతం కిలో 4 లక్షల రూపాయలు ఉన్నదని పాన్ మసాలా తంబాకు రూ .5రూపాయలుగా ఉన్నది. ఈ సమయంలో పాన్ మసాలాలు కనీసం దాని వాసన  కూడా చేర్చలేదని కానీ హీరోలు నటించిన ఈ ప్రకటనలో మాత్రం పలుకు పలుకులలో కేసరి అంటూ చెబుతున్నారు.. ఇది వినియోగదారులను మోసగించేలా ఉందంటూ ఆరోపించారు యోగేంద్ర సింగ్. మార్చి 8న ఈ ముగ్గురు బాలీవుడ్ హీరోలు హాజరు కావాలని తెలియజేశారు. అలాగే విమల్ గుట్కా బ్రాండ్ తయారు చేస్తున్న జె.బి ఇండస్ట్రీ చైర్మన్ కు మార్చి 19న హాజరుకావాలని నోటీసులను జారీ చేసినట్లుగా తెలుస్తున్నది. మరి ఆరోజు ఏం జరుగుతుందో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: