అవును ఇప్పుడు ఇదే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు నందమూరి ఫ్యాన్స్ .జూనియర్ ఎన్టీఆర్ తన గోతిని తానే తవ్వుకుంటున్నారని .. తన పేరుని సోషల్ మీడియాలో ట్రోలింగ్ అయ్యేలా మార్చేసుకుంటున్నారు అని జనాలు మాట్లాడుకుంటున్నారు . హీరో జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోలింగ్కి గురవుతున్నాడు . మరీ ముఖ్యంగా మిగతా స్టార్ లు పాన్ ఇండియా హీరోస్ అందరూ కూడా బ్యాక్ టు బ్యాక్ బడాబడా దర్శకులతో సినిమాకి కమిట్ అవుతూ ఉంటే ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 సినిమాని అదే విధంగా దేవర కి కమిట్ అవ్వడం..


దేవర సినిమా అనుకున్నంత స్థాయిలో హిట్ కాకపోవడం ..వార్ 2 మూవీ పోస్ట్ పోన్ అవుతూ ఉండడం జూనియర్ ఎన్టీఆర్ కి నెగటివ్ మార్క్ వచ్చేలా చేసింది . అయితే జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు పెద్ద డైరెక్టర్లతో సినిమాకి కమిట్ అవ్వడం లేదు . మరొక పక్క అల్లు అర్జున్ మరొక పక్క రామ్ చరణ్ ..మహేష్ బాబు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను అనౌన్స్ చేస్తూ ఉంటే .. ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్  సినిమాని ఆలస్యంగా సెట్స్ పైకి తీసుకొస్తున్నాడు అనేది బిగ్ క్వశ్చన్ మార్క్ గా మారిపోయింది .



రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ ఓ కమర్షియల్ యాడ్ లో నటించారు . ఈ యాడ్ లో ఆయన లుక్స్ ఫుల్ నెగిటివ్గా ట్రోల్ కి గురవుతున్నాయి . అసలు ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటి లుక్స్ ని ఎంకరేజ్ చేశారు . ఆయనకి తన ఫ్యాన్స్ హర్ట్  అవుతారని తెలియదా..? అంటూ మాట్లాడుకుంటున్నారు. బ్యాక్ టు బ్యాక్ సోషల్ మీడియాలో అన్నీ కూడా జూనియర్ ఎన్టీఆర్ పై నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తూ ఉండడంతో ఫ్యాన్స్ ఫుల్ డిసప్పాయింట్ అవుతున్నారు . సాధారణంగా ఏ పాన్ ఇండియా హీరో హిట్  కొట్టిన ఆయన పేరు మారుమ్రోగిపోతుంది . కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఆర్.ఆర్.ఆర్  సినిమాలో నటించినప్పటి నుంచి బ్యాడ్ లక్ ఆయన వెంట వస్తుంది అని మాట్లాడుకుంటున్నారు.  ఈ సినిమాలో చరణ్ పాత్ర హైలెట్గా మారడం అదేవిధంగా దేవర సినిమా అంత రీచ్ కాకపోవడం.. వార్ 2 పోస్ట్ పోన్ అవుతూ ఉండడం ఇప్పుడు ఇలా ఒక యాడ్ కారణంగా ట్రోల్ అవ్వడం ఆయనకు బ్యాడ్ లక్ గా చెప్పుకుంటున్నారు జనాలు..!

మరింత సమాచారం తెలుసుకోండి: