మెగా బ్రదర్స్ అన్నా, తమ్ముళ్ల మధ్యలో మధ్యమవాది ఉన్న‌ కొణిదెల నాగబాబు మరోసారి వార్తల్లోకి హ‌ట్ టాపిక్ గా మారరు .. రాజకీయ అరంగేట్రం చేసిన తర్వాత తొలిసారి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఆయన త‌న ఆస్తుగా  70 కోట్ల రూపాయల  ప్రకటించారు. మెగా బ్రదర్‌గా సినీ, టీవీ రంగాల్లో పేరుప్రఖ్యాతులు తెచ్చుకున్న ఆయన తన ఆస్తులను అఫిడవిట్‌లో వెల్లడించారు . ఆంధ్రప్రదేశ్ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి గా జనసేన పార్టీ నాయకుడు పవన్ సోదరుడు నాగబాబు నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే ..


అయితే ఎన్నికల సంఘానికి ఆయన సమర్పించిన అఫిడవిట్‌లో నాగబాబు తన ఆస్తుల , అప్పుల వివరాలను బయటపెట్టాడు .. ఆయనకు 70 కోట్ల ఆస్తులు ఉన్నంటు ప్రకటించిన‌ నాగబాబు తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని కూడా స్పష్టం చేశాడు .. అయితే మెగా ఫ్యామిలీ గురించి ప్రతి చిన్న విషయాన్ని ఆసక్తిగా చర్చించే అభిమానులకు నాగబాబు ఎన్నికలఅఫిడవిట్‌ లో పేర్కొన్న ఆస్తులు అప్పులు ప్రస్తుతం ఆటాపిక్ గా మారాయి .. ఇక ఇందులో చిరంజీవి , పవన్ దగ్గర నాగబాబు అప్పు తీసుకున్నట్టు ప్రకటించడం మరింత హాట్ టాపిక్ గా మారింది .

ఇక నాగబాబు దగ్గర బండ్లు , మ్యూచువల్ ఫ్రెండ్స్ నగదు కలిపి 59 కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నాయి ..

మ్యూచువల్ ఫండ్స్/బాండ్లు – రూ.55.37 కోట్లు

చేతిలో నగదు – రూ.21.81 లక్షలు

బ్యాంకు నిల్వలు – రూ.23.53 లక్షలు

ఇతరులకు ఇచ్చిన అప్పులు – రూ.1.03 కోట్లు

బెంజ్ కారు –రూ.67.28 లక్షలు

హ్యుందాయ్ కారు – రూ.11.04 లక్షలు

బంగారం & వెండి – రూ.57.99 లక్షల విలువైన 724 గ్రాముల బంగారం, భార్య వద్ద 55 క్యారట్ల వజ్రాలు (రూ.16.50 లక్షలు), 20 కేజీల వెండి (రూ.21.40 లక్షలు)

హైదరాబాద్ పరిసరాల్లో 11 కోట్ల స్థిరాస్తులు

నాగబాబు కు హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో భూములున్నాయి.

రంగారెడ్డి జిల్లాలో 2.39 ఎకరాల భూమి – రూ.5.3 కోట్లు

మెదక్ జిల్లా నర్సాపూర్‌లో 8.28 ఎకరాల భూమి – రూ.82.80 లక్షలు

రంగారెడ్డి జిల్లా టేకులాపల్లిలో 1.07 ఎకరాల భూమి – రూ.53.50 లక్షలు

హైదరాబాద్ మణికొండలో విల్లా – రూ.2.88 కోట్లు

మొత్తం స్థిరాస్తుల విలువ – రూ.11.20 కోట్లు

మెగా బ్రదర్స్‌కు అప్పులు !
అఫిడవిట్‌లోని ఆసక్తికర అంశాల్లో ఒకటి అన్న చిరంజీవి , తమ్ముడు పవన్ కల్యాణ్ దగ్గర అప్పులు తీసుకున్న విషయం..

చిరంజీవి దగ్గర రూ.28.48 లక్షలు అప్పు

పవన్ కల్యాణ్ దగ్గర రూ.6.90 లక్షలు అప్పు తీసుకున్నట్లు నాగబాబు ప్రకటించారు.

ఇవే కాకుండా, బ్యాంక్ హౌసింగ్ లోన్ రూ.56.97 లక్షలు, కారు రుణం రూ.7.54 లక్షలు ఉన్నట్లు ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: