
మెగాస్టార్ చిరంజీవితోను అదే విధంగా పవన్ కళ్యాణ్ తోనూ అదే విధంగా రాంచరణ్ తో నటించిన ఘనత కాజల్ అందుకుంది . మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ తో కూడా నటించి స్పెషల్ రికార్డ్స్ తన ఖాతాలో వేసుకుంది . సేమ్ శృతిహాసన్ కూడా అల్లు అర్జున్ - పవన్ కళ్యాణ్ - చిరంజీవి - రామ్ చరణ్ తో నటించి క్రేజీ రికార్డ్ అందుకుంది. కాజల్ -శృతి హాసన్ తర్వాత ఆ స్థానాన్ని అందుకోబోతుంది అంజలి. అంజలి ఆ ప్లేస్ లోకి రాబోతున్నట్లు తెలుస్తుంది. అంజలి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ తో "వకీల్ సాబ్" లో నటించింది .
అల్లు అర్జున్ తో స్పెషల్ సాంగ్ లో మెరిసింది . రామ్ చరణ్ తో "గేమ్ ఛేంజర్" సినిమాలో నటించింది . అయితే ఇప్పుడు చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది అంజలి అంటూ ఓ న్యూస్ ట్రెండింగ్ లోకి వచ్చింది . అనిల్-చిరంజీచి కాంబోలో ఒక సినిమా రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే . ఈ సినిమాలో అన్షుని హీరోయిన్గా ఫిక్స్ చేసుకున్నారట అనిల్ రావిపూడి. అయితే ఈ సినిమాలో ట్రెడిషనల్ పాత్ర కోసం హీరోయిన్ అంజలిని అప్రోచ్ అయ్యారట. ఆమె కూడా ఈ పాత్రను ఓకే చేసిందట. ఒకవేళ అదే నిజమైతే మాత్రం ఇది నిజంగా ఒక ఇండస్ట్రీ రికార్డ్ అనే చెప్పాలి. కాజల్ - శృతిహాసన్ తర్వాత అలాంటి క్రేజీ స్థానం అందుకోబోతున్న హీరోయిన్ అంజలి అని మాట్లాడుకుంటున్నారు జనాలు . సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ వార్త బాగా ట్రెండింగ్ లోకి వచ్చింది..!