ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్ నుంచి గ్లోబల్ స్థాయిలో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో రాజమౌళి , మహేష్ బాబు సినిమా కూడా ఒకటి .. ఈ సినిమా గురించి కష్టపడి రాజమౌళి ఎంత దాచి పెట్టాలని చూస్తున్న ఏదో విధంగా అప్డేట్స్ బయటికి వస్తూనే ఉన్నాయి . అయితే ఇప్పుడు తాజాగా ఓ కీలక అప్డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .. రాబోయే మూడు వారంలో ఏం చేయబోతున్నారని వార్త ఇది .. దీంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు . మరి SSMB29  షూటింగ్ షెడ్యూల్ ఏంటి అనేది చూద్దాం. మహేష్ బాబు ఫోకస్ అంతా ఇప్పుడు రాజమౌళి సినిమాపైనే ఉంది .. ఎక్కడ బయటికి కూడా రావట్లేదు అంటే రాజమౌళి రానవ్వట్లేదని అనుకోవాలి ..


షూటింగ్ మొదలై నెల రోజులు అవుతున్న ఎక్కడ జరుగుతుంది ఏ షూ చేస్తున్నారని అప్డేట్ కూడా బయటికి రాకుండా ఎంతో పగడ్ బందీగా ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా షూటింగ్ పై కీలక అప్డేట్ బయటకు వచ్చింది . ఈ షూటింగ్ మొదలైన రోజు నుంచి సిటీ దాటి బయటకు వెళ్లలేదు చిత్ర యూనిట్ . రామోజీ ఫిలిం సిటీ తో పాటు కొన్ని సన్నివేశాలు అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరించాడు రాజమౌళి. ఇప్పటివరకు జరిగిన షెడ్యూల్స్‌లో మహేష్ బాబు తో పాటు ప్రియాంక చోప్రా , జాన్ అబ్రహం కూడా పాల్గొన్నాటు తెలుస్తుంది .. అయితే ఇప్పుడు మొదటిసారిగా ఈ సినిమా కోసం హైదరాబాద్ దాటారు చిత్ర యూనిట్ ..


మహేష్ , రాజమౌళి సినిమా యూనిట్ అంతా ప్రస్తుతం ఒడిశాలో ఉన్నారు. అలాగే రాబోయే మూడు వరల పాటు అక్కడే షూటింగ్ జరగనుంది .. అక్కడ ఉన్న డిడియోమాలి, తలమాలి, కాళ్యమాలి అటవీ ప్రాంతాల్లో  23 రోజుల షెడ్యూల్లో ప్లాన్ చేశాడు జక్కన్న . కోలాబ్ డ్యామ్ పరిసర ప్రాంతాల్లో ఈ షెడ్యూల్ జరుగుతుంది .. ఇప్పటికే రాజమౌళి ఒడిశా హోటల్లో దిగిన ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. అలాగే ఈ మహేష్ బాబు సినిమాలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ సైతం నటించబోతున్నాడు అంటూ తెలుస్తుంది .. అంతర్జాతీయ ప్రమాణికాలతో ఈ సినిమాని తెర్కక్కిస్తున్నాడు రాజమౌళి .. ఈ సినిమా టాకీ ని ఈ సంవత్సరంలోనే పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కు ఎక్కువ టైం తీసుకోవాలని చూస్తున్నాడు  రాజమౌళి ... అన్ని కుదిరితే 2027లో ఈ మహేష్ , రాజమౌళి సినిమా రిలీజ్ అవ్వటం ఫిక్స్ .

మరింత సమాచారం తెలుసుకోండి: